https://oktelugu.com/

Sr NTR: ఆ విషయంలో ఎన్టీయార్ ను బుక్ చేసిన భానుమతి.. మ్యాటరేంటంటే..

ఆయన కున్న ఫాలోయింగ్ తోనే ఆయన ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యారంటే మామూలు విషయం కాదు.అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న ఏకైక హీరో శ్రీ నందమూరి తారక రామారావు గారు...

Written By:
  • Neelambaram
  • , Updated On : February 29, 2024 / 06:12 PM IST
    Follow us on

    Sr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా తన కంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్న నటుడు శ్రీ నందమూరి తారక రామారావు(NTR) గారు..ఈయన క్రేజ్ ముందు ఏ హీరో పని చేయడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ఆయన కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆ ఫాలోయింగ్ తోనే ఆయన ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యారంటే మామూలు విషయం కాదు.అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న ఏకైక హీరో శ్రీ నందమూరి తారక రామారావు గారు…

    ఇక ఇది ఇలా ఉంటే ఆయన ‘తాతమ్మకల’ అనే సినిమా చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ గా భానుమతి గారిని తీసుకోవాలని అనుకున్నారట. ఈ సినిమా రైటర్ అయిన డి వి నరసరాజు భానుమతి దగ్గరికి వెళ్లి ఈ సినిమా కోసం మీరు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో చెప్పండి అని అడిగాడట. దాంతో ఆమె ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎంతైతే తీసుకుంటాడో దానికి ఒక 5 వేలు తగ్గించి నాకు ఇవ్వండి అని చెప్పిందట. దాంతో డి వి నరసరాజు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పగా, ఎన్టీఆర్ అప్పటికే 4 నుంచి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

    కానీ డివి నరసరాజు తో నేను 2 లక్షల తీసుకుంటున్నాను అని చెప్పి ఆమెకి ఒక లక్ష 90 వేలు ఇవ్వండి అని చెప్పాడట. దాంతో భానుమతి దగ్గరికి వెళ్లిన నరసరాజు ఎన్టీఆర్ రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు మీరు 1,90,000 తీసుకోండి అని చెప్పాడట. దాంతో భానుమతి ఎన్టీఆర్ 1,90,000 తీసుకుంటున్నారా, అయితే దానికి ఇంకొక 5000 కలిపి ఇస్తున్న నెక్స్ట్ నేను తీయబోయే ‘అమ్మాయి పెళ్లి ‘ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి అని చెప్పిందట. దాంతో డివి నరసరాజు ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి చెప్పగా, ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడట. రెమ్యునరేషన్ ఇస్తే తీసుకోవాలి గానీ, రివర్స్ లో మనల్ని సినిమా చేయమనడం ఏంటి అని ఎన్టీఆర్ కొద్దిసేపటి వరకు షాక్ కి గురయ్యాడట.

    ఇక ఒప్పుకున్నాక తప్పదు కాబట్టి మళ్లీ తను చేయను అంటే ఎన్టీఆర్ పేరుకే అవమానం వస్తుంది. కాబట్టి భానుమతి గారు చెప్పినట్టుగానే ‘అమ్మాయి పెళ్లి’ సినిమాలో నటించి మెప్పించాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో భానుమతి గారికి, ఎన్టీఆర్ కి మంచి పేరైతే వచ్చింది. ఇక ఈ సంఘటన తర్వాత ఎన్టీఆర్ భానుమతి చాలా గడుసు పిల్లా అని చాలామంది దగ్గర చెప్పాడట…