T20 World Cup 2024 : జూన్ లో వెస్టిండీస్ – అమెరికా దేశాలలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి సమరానికి న్యూజిలాండ్ తమ జట్టు ఆటగాళ్లను ప్రకటించింది. కెన్ విలియమ్స ను సారథిగా నియమించింది. 15 మందితో కూడిన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. అన్ని జట్ల కంటే న్యూజిలాండే ఈ సమరానికి జట్టను ప్రకటించింది. అయితే, ఎటువంటి సంచలనాలకు తావివ్వకుండా న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. కొంతకాలంగా ఫామ్ లేమి తో బాధపడుతున్న ఆటగాళ్లపై న్యూజిలాండ్ జట్టు యాజమాన్యం వేటువేసింది. గాయాల బారిన పడిన ఆటగాళ్లను నిర్మొహమాటంగా పక్కన పెట్టింది.
ఫాస్ట్ బౌలర్ కైల్ జెమిసన్, ఆల్ రౌండర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ నకు దూరమయ్యారు. ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతున్న విల్ ఓరూర్క్, టామ్ లాథం, టిమ్ సిఫెర్ట్ ను న్యూజిలాండ్ జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది.. కేన్ విలియంసన్, టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్ కు ప్రపంచ కప్ లో అవకాశం కల్పించింది. కెన్ విలియమ్సన్ కు కెప్టెన్ గా ఇది నాలుగవ టి20 వరల్డ్ కప్. ఆటగాడిగా ఆరవ వరల్డ్ కప్.
టీ – 20 కప్ సాధించాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడుతున్న రచిన్ రవీంద్ర అనుకున్నంత స్థాయిలో ఫామ్ లో లేకపోయినప్పటికీ.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో అతడు అద్భుతంగా రాణించాడు. మ్యాట్ హెన్రీకి కూడా దూకుడుగా ఆడే నైజం ఉన్న నేపథ్యంలో.. వారిద్దరికీ న్యూజిలాండ్ జట్టు అవకాశం కల్పించింది. రిజర్వ్ ఆటగాడిగా బెన్సీ ఇయర్స్ ను ఎంపిక చేసింది.. జూన్ 7న గయానా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో న్యూజిలాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ – సీ లో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆఫ్గానిస్థాన్ తో పాటు వెస్టిండీస్, ఉగాండా, పాపువా, న్యూ గినియా వాటి జట్లతో తలపడనుంది.
న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు వీరే
కెన్ విలియంసన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్ వెల్, మార్క్ చాప్ మెన్, డెవాన్ కాన్వే, లాకీ పెర్గూ సన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి, రిజర్వ్ ఆటగాడు: బెన్ సియర్స్.