https://oktelugu.com/

Finn Allen : 5 ఫోర్లు, 16 సిక్సర్లు.. ఏం కొట్టుడు స్వామీ.. మొత్తుకున్న పాక్ బౌలర్లు…

ఇక ఫిన్ అలెన్ విధ్వంసాన్ని టి 20 వరల్డ్ కప్ లో ఎవరు ఆపుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది...

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2024 / 05:59 PM IST
    Follow us on

    Finn Allen : న్యూజిలాండ్ పాకిస్తాన్ టీముల మధ్య జరిగిన మూడోవ టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ కు చెందిన ఫిన్ అలెన్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాకుండా ఈ మ్యాచ్ ని చూసిన ప్రతి ఒక్కరికి తనదైన రీతిలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ని అందించాడు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఫిన్ అలెన్ పేరే వినిపిస్తుంది.

    కేవలం 62 బంతుల్లో 137 పరుగులు చేసిన ప్లేయర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా న్యూజిలాండ్ టీమ్ తరఫున టి 20 మ్యాచ్ ల్లో వ్యక్తిగతంగా ఒక మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ గా కూడా ఫిన్ అలెన్ ఒక రికార్డ్ ని క్రియెట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో 16 సిక్స్ లు, 5 ఫోర్ల తో చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలాల భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ బౌలర్లు సైతం చేతులెత్తేశారు. ఊచ కోత అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఈ మ్యాచ్ చూసినవాళ్లకి ఊచకోతంటే ఏంటో అర్థం అవుతుంది.

    బంతి గాల్లో నుంచి నేల మీద పడడం ఆలస్యం దాన్ని బౌండరీ దాటించడమే లక్ష్యం గా పెట్టుకొని ఆడే ఏకైక సత్తా ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ కావడం విశేషం…ఇక తను గత మ్యాచ్ లో కూడా మంచి ప్రతిభను చాటుకున్నాడు. మొదటి మ్యాచ్ కి అలెన్ దురమైనప్పటికి, ఇక రెండో మ్యాచ్ లో 74 పరుగులు చేసి ఒక అద్భుతమైన ఆఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలో ఈయన మూడోవ మ్యాచ్ లో సెంచరీ చేసి టీమ్ కి మంచి విజయాన్ని అందించాడు. ఇక దీంతో న్యూజిలాండ్ టీమ్ టి20 వరల్డ్ కప్ కి ముందు పాకిస్థాన్ మీద టి 20 సిరీస్ ని గెలిచి వాళ్ల ప్లేయర్లందరు కూడా టి20 వరల్డ్ కప్ కి అనుకూలంగా ఉండటమే కాకుండా, మంచి ఫామ్ లో ఉన్నారు అనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు సైతం పంపించినట్టుగా తెలియజేస్తుంది. ఇక ఫిన్ అలెన్ విధ్వంసాన్ని టి 20 వరల్డ్ కప్ లో ఎవరు ఆపుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…