Ram Charan: రామ్ చరణ్ సినిమా లో గెస్ట్ గా నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో..?

ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేసిన త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం ఆయనకి నటుడు గా మంచి పేరు సంపాదించి పెట్టింది.

Written By: Gopi, Updated On : January 17, 2024 5:59 pm

Ram Charan

Follow us on

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నటుడు రామ్ చరణ్…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే అంత స్టేజ్ కి ఎదిగాడు అంటే దాని వెనక ఆయన కృషి, పట్టుదల ఎంతలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేసిన త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం ఆయనకి నటుడు గా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక ఇప్పుడు తను గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా చేయాల్సి ఉంది.

ఇక ఈ సినిమా వీలైనంత తొందరల్లోనే సెట్స్ మీదకి వెళ్లే ప్రాసెస్ లో ఉంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక పది నిమిషాలు కనిపించే గెస్ట్ క్యారెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకుందాం అని చాలామంది స్టార్ హీరోల పేర్లను పషిలించినప్పటికి ఈ క్యారెక్టర్ కి బాలీవుడ్ కి చెందిన సల్మాన్ ఖాన్ అయితే బాగుంటాడని అందుకే ఈ సినిమాలో ఆయన్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అయితే హిందీ మార్కెట్ కూడా చాలా వరకు ప్లస్ అవుతుంది.

అలాగే సల్మాన్ ఖాన్ అయితేనే ఆ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని డైరెక్టర్ బుచ్చిబాబు స్ట్రాంగ్ గా నమ్మి, రామ్ చరణ్ కి చెప్పడంతో రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది. మొత్తానికైతే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక మంచి క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…