Bhakta Kannappa: యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ముఖ్యంగా మాస్ హీరోగా ఎదిగాడు. ఒకప్పుడు వాళ్ల పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకి ఎలాంటి ఇమేజ్ అయితే ఉండేదో అచ్చం అలాంటి ఇమేజ్ నే ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.
ఇక దాంతో ప్రభాస్ అభిమానులు అందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇక ముఖ్యంగా బాహుబలి సినిమాతో అయితే ఆయన క్రేజ్ ఒక్కసారి గా తారా స్థాయికి చేరుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో ప్రూవ్ చేసి చూపించాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, కల్కి సినిమాల షూటిం గుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇదే క్రమంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి.
మరి ఈ సినిమాలో తను నటిస్తున్నాడా లేదా అనేది కూడా ఓ చిన్నపాటి అనుమానంగా అయితే ఉంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా కోసం తన పది రోజుల డేట్స్ ని కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన షూట్ కూడా కొంతవరకు పూర్తి చేశారట. ఇంకా రెండు రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అంటు సినిమా యూనిట్ ద్వారా సమాచారం అయితే అందుతుంది. ఇక రీసెంట్ గా మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ చేసిన క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ ని తొందరల్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ తెలియజేశాడు…
ఇక దాంతో ప్రభాస్ అభిమానులు కొంతవరకైతే నిరాశని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ మంచు ఫ్యామిలీతో సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వాళ్లు ప్రతి ఒక్క హీరోని డామినేట్ చేస్తూ వాళ్లు మాత్రమే హైలైట్ అయ్యే విధంగా సినిమాని తెరకెక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కాంట్రవర్సి ల్లో కూడా నిలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో సినిమా చేయడం ప్రభాస్ చేస్తున్న పొరపాటు అంటూ తన అభిమానులు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…