Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions trophy 2025) విరాట్ కోహ్లీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో అతడు ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ చేశాడు.. జట్టుకు అవసరమైన సందర్భంలో పరుగులు చేసి ఆదుకున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. టీమిండియాను గెలిపించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కీలకమైన 85 పరుగులు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ చుట్టూ సోషల్ మీడియా తిరుగుతోంది.
Also Read: CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?
కొంతకాలంగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేక ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో అతడు రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందనే విమర్శలు వినిపించాయి. వన్డేల నుంచి తప్పుకుంటే మిగతా ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయని మాజీ ప్లేయర్ల నుంచి చురకలు కూడా అంటాయి. అయితే అలాంటి విమర్శలు, చురకలు ఎన్ని వచ్చినా విరాట్ కోహ్లీ మౌనంగానే ఉన్నాడు. వాటన్నింటికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని భావించాడు. అనుకున్నట్టుగానే.. తన బ్యాటుతో వారందరికీ సమాధానం చెబుతున్నాడు. తను ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో? జట్టు కోసం ఎలా ఆడాలో 36 సంవత్సరాల వయసులో అతడు నిరూపిస్తున్నాడు. అందువల్లే మైదానమే కాదు, సోషల్ మీడియా విరాట్ కోహ్లీ నామస్మరణతో మైమర్చిపోతోంది.
అంతమంది సెర్చ్ చేశారు
విరాట్ కోహ్లీ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ తో పాటు హాఫ్ సెంచరీ చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులు మొత్తం చేశాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డాడు. మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నప్పుడు తను స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్ అయ్యాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తనను తాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా కష్టాలలో ఉన్నప్పుడు అతడు తనదైన ఆట తీరు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. జట్టు విజయం సాధించడానికి అవసరమైన పరుగులను చేసి అదరగొట్టాడు. అందువల్లే మైదానంతో పాటు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పేరు మారుమోగిపోతుంది. ఇక ఈ ఏడాది వికీపీడియాలో అత్యధిక సార్లు నెటిజెన్లు సెర్చ్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 6.61 లక్షల సార్లు నెటిజెన్లు విరాట్ కోహ్లీ గురించి సెర్చ్ చేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర గురించి 2.42 లక్షల మంది, శుభ్ మన్ గిల్ గురించి 2.38 లక్షల మంది శోధించారు..” విరాట్ శరీర సామర్థ్యాన్ని కాపాడుకోడానికి ఏం చేస్తాడు? అతడు ఎలాంటి ఆహారాన్ని తింటాడు? అతడు తను తాగే నీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాడు? విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఎక్కడ జీవిస్తున్నాడు? అతడికి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ ఎంత? విరాట్ కోహ్లీ ఏం చదువుకున్నాడు? అతడి నేపథ్యం ఏమిటి? విరాట్ కోహ్లీ బంధువులు ఏం చేస్తుంటారు? విరాట్ కోహ్లీ ఆర్థిక వ్యవహారాలు ఎవరు పర్యవేక్షిస్తారు? ” ఇలా అనేక ప్రశ్నలు వేసి.. విరాట్ కోహ్లీకి సంబంధించిన వివరాలను నెటిజన్లు తెలుసుకున్నారు. ఆదివారం న్యూజిలాండ్ గట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆడుతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ మీదే ఉంది.