Champions Trophy 2025 : రెండు జట్లు అత్యంత బలంగా ఉండడంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో పేస్ బౌలర్ హెన్రీ ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో క్లాసెన్ క్యాచ్ పట్టే క్రమంలో అతడి భుజం మైదానానికి బలంగా తగిలింది. దీంతో అతడు గాయపడ్డాడు. తీవ్రంగా ఇబ్బంది పడిన అతడిని వైద్యులు పర్యవేక్షించారు. ఆ తర్వాత అతడు మైదానంలోకి వచ్చినప్పటికీ.. అంత మెరుగ్గా బౌలింగ్ వేయలేకపోయాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో అతడు ఆడేది అనుమానంగానే ఉంది. అతడి ఆరోగ్యం పై కెప్టెన్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నాం. వైద్యులు అతడిని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అతడు కోలుకుంటాడని” శాంట్నర్ వెల్లడించాడు. ఇక టీమిండియాలో కుల దీప్ యాదవ్ ఆడేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. సెమి ఫైనల్ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆడిస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ జట్టుపై వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. అందువల్ల అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read : CT ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన.. కోచ్, టీం మీటింగ్ లో చెప్పేశాడా?
వర్షం కురిస్తే..
దుబాయిలో ఆదివారం వర్షం కురిసే అవకాశాలు లేకపోయినప్పటికీ.. ఒకవేళ వర్షం కురిస్తే రెండు జట్లు కనీసం 25 ఓవర్ల పాటు ఆడితే డక్ వర్త్ లూయిస్ విధానంలో ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ అప్పటికి కూడా మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే రిజర్వ్ డే కు వాయిదా వేస్తారు. అప్పుడు కూడా వరుణదేవుడు కనికరం చూపకపోతే రెండు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు. ఒకవేళ మ్యాచ్ టై గనుక అయితే ఫలితం తేలే వరకు రెండు జట్లు సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అయితే చాంపియన్ ట్రోఫీ చరిత్రలో భారత్ – శ్రీలంక జట్ల విషయంలో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగింది. అప్పుడు ఈ రెండు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటించింది. అయితే ఇప్పుడు దుబాయ్ లో ఉన్న వాతావరణం దృష్ట్యా వర్షం కురిసే అవకాశం లేదని.. ఆదివారం నాడు వాతావరణం పొడిగా ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..” ఆదివారం వర్షం కురిసే అవకాశం లేదు. వాతావరణం పొడిగా ఉంటుంది. మ్యాచ్ కు వాతావరణ సహకరిస్తుంది. మ్యాచ్ కు అంతరాయం కలుగుతుందని అపోహలను అభిమానులు పెట్టుకోవద్దని” దుబాయ్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Also Read : న్యూజిలాండ్ జట్టును ఆడిపోసుకుంటున్నాం గానీ.. అది కూడా బాధిత జట్టే..