Pawan Kalyan and Renu Desai : పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. ఖాళీ సమయాన్ని ఈ చిత్రాల షూటింగ్స్ కొరకు వినియోగిస్తున్నారు. త్వరలో ఆయన నటవారసుడిగా అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అకీరా నందన్ పక్కా హీరో మెటీరియల్. ఆరున్నర అడుగుల హైట్ తో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అకీరా వీలైనంత త్వరగా హీరోగా మారాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : ఇలాంటి దుర్మార్గులకు దూరంగా ఉండాలి..కఠినంగా శిక్షించాలి అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి అకీరా నందన్, ఆద్య సంతానం అన్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ రేణు దేశాయ్-పవన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వారు స్నేహితులుగా కొనసాగుతున్నారు. కొన్నేళ్లు పూణేలో ఉన్న రేణు దేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆమె నటిగా రీ ఎంట్రీ సైతం ఇచ్చారు. రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలకమైన నిజ జీవిత పాత్ర చేశారు.
మంచి పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధం అంటున్నారు. రేణు దేశాయ్ యానిమల్ లవర్. సనాతన ధర్మం పాటిస్తుంది. పవన్ కళ్యాణ్ వలె ఆమెకు సామాజిక స్పృహ కూడా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
జానీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. కానీ ఆ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడు. ఆ విధంగా ఆశించిన స్థాయిలో ఆడని సినిమాల నిర్మాతలకు ఆయన రెమ్యూనరేషన్ రిటర్న్ చేసేవాడు. పరిశ్రమలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేస్తాడు. ఇవన్నీ రహస్యంగా చేస్తాడు. పవన్ కళ్యాణ్ కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియనీయడు…. అంటూ పవన్ గొప్ప స్వభావాన్ని రేణు దేశాయ్ బయటపెట్టింది. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ బద్రి, జానీ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. జానీ మూవీ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.
Also Read : తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది… పవన్ కళ్యాణ్ ఫోటో పై రేణు దేశాయ్ సంచలన పోస్ట్!