Mukesh Ambani: కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటాయి.. కాని దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. తర్వాత ఆలోచిస్తే అలా చేసి ఉండాల్సింది కాదు అనే పశ్చాతాపం మనలో మొదలవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే… ఈ సంఘటన వెనుక అంతటి కథ ఉంది కాబట్టి. ఇండియన్ క్రికెట్ టీం లో హర్భజన్ సింగ్ ప్రస్తావన లేకుండా ఉండదు.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆటగాడు తనదైన దూస్రా బౌలింగ్ తో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు కట్టబెట్టాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా అనితరసాధ్యమైన విజయాలు అందించాడు. ముంబై టీం ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు కారణమయ్యాడు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ” నువ్వు మెడిసిన్ లాంటోడివి సిద్ధూ.. కాని దానికి ఎక్స్పైరీ ఉంటుంది కదా! రావి చెట్టుకు పూజ చేసినంత మాత్రాన మన గోడ మీద మొలిస్తే పీకి అవతల పడేస్తాం” రావు రమేష్ అంటాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించినప్పటికీ అతడిని ముఖేష్ అంబానీ పీకి అవతల పడేసాడు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.
ఆ ఆలింగనమే లేకుంటే..
అది ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గెలిచిన రోజు. ముంబై ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్న రోజు. ఆ జట్టు యజమాని నీతా అంబానీ పట్టరాని ఆనందంలో స్టేడియం లోకి వచ్చారు. అక్కడే ఉన్న హర్భజన్ సింగ్ నీతా అంబానీ అమాంతం ఎత్తుకున్నారు. అలా ఆమెను గాలిలో లేపారు. ఆమె కూడా ముసి ముసి నవ్వులు నవ్వారు. ఇది అక్కడే ఉండి చూస్తున్న ముకేశ్ అంబానికి నచ్చలేదు. ఆ కోపాన్ని వెంటనే చూపించకుండా దానిని తర్వాత ప్రదర్శించారు.
దూరం పెట్టారు
ఎప్పుడైతే హర్భజన్ సింగ్ అలాంటి పని చేశారో ముకేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించారు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయకుండా చేశారని క్రికెట్ నిపుణులు అంటూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయలేదు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో ముఖేష్ అంబానీ మనసు కాస్త చల్లబడింది.
అమితమైన ప్రేమ
ముఖేష్ అంబానికి తన భార్య నీతా అంబానీ అంటే చాలా ప్రేమ. ఆమె పుట్టిన రోజు ఏకంగా పెద్ద ఓడనే బహుమతిగా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి తన భార్యను ఎవరైనా ముట్టు కుంటే ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. అందుకే తన ముందు తన భార్యను అమాంతం ఎత్తుకున్న హర్భజన్ సింగ్ పై కోపం పెంచుకున్నాడు. దానిని తర్వాత చూపించాడు. ఫలితంగా ఐపీఎల్ క్రికెట్ టోర్నీకి పంజాబ్ బౌలర్ ను శాశ్వతంగా దూరం చేశాడు. ఫలితంగా మైదానంలో పంతులు వేయాల్సిన హర్భజన్.. ఇప్పుడు మైదానం అవతల కామెంట్రీ చెబుతున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఇక గతంలో హర్భజన్ నీతా అంబానీ ఎత్తుకున్న ఫోటోలను, ఆగ్రహంగా ఉన్న ముఖేష్ అంబానీ ఫోటోలను జతచేస్తూ కొంతమంది ఒక వీడియో రూపొందించారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏకంగా మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. తన భార్యను ఎత్తుకుంటే ముఖేష్ ఊరుకుంటాడా? హర్భజన్ సింగ్ అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.