https://oktelugu.com/

Anand Mahindra: వైరల్ వీడియో: ఈ ఎలుగుబంటిని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎందుకంటే?

ఆనంద్ మహీంద్రా ట్విట్ చేసిన వీడియోలో ఒక దృఢమైన ఎలుగుబంటి కనిపించింది. అది దట్టమైన అడవిలో ఉంది. దాని ఎదురుగా ఉధృతంగా సాగుతున్న నది ప్రవాహం కనిపించింది. ఆ నది ప్రవాహం ఒడ్డున ఎలుగుబంటి తీక్షణంగా చూస్తూ కనిపించింది. అంతటి ఉధృతమైన ప్రవాహంలోనూ ఆ ఎలుగుబంటి ఆ నీటినే చూస్తూ ఉంది.

Written By:
  • Rocky
  • , Updated On : April 27, 2023 / 07:46 AM IST

    bear

    Follow us on

    Anand Mahindra: మనలో చాలామందికి సహనం ఉండదు. ఏకాగ్రత ఉండదు. చిన్న చిన్న విషయాలకే అసహనానికి గురవుతాం.చిరాకు పడతాం. పట్టరాని కోపంతో పక్క వాళ్ళ మీద అరుస్తాం. అలాంటప్పుడే మన పెద్దలు నీతి సూక్తులు చెప్తారు. మన బుర్రకు అర్థమయ్యేలా అందులో జంతువుల ప్రస్తావన తీసుకొస్తారు. చీమను చూసి పొదుపు చేయడం, గేదెను చూసి క్రమశిక్షణ నేర్చుకోవడం, కోయిలను చూసి ఆస్వాదించడం.. ఇలా రకరకాల ఉదాహరణలు చెప్తారు. అందుకే చాలా సందర్భాల్లో జంతువులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా జీవితంలో నిరాశగా బతికేవారు ఈ ఎలుగుబంటిని చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్రా గురించి తెలిసింది కదా.. ఆయన పేరుకు వ్యాపారవేత్త మాత్రమే కాదు సామాజికవేత్త కూడా.. తనకు ప్రేరణ కలిగించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. జనాలను జాకృతం చేస్తుంటారు. అలాంటిదే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను ట్వీట్ చేశారు.

    అందులో ఏముందంటే

    ఆనంద్ మహీంద్రా ట్విట్ చేసిన వీడియోలో ఒక దృఢమైన ఎలుగుబంటి కనిపించింది. అది దట్టమైన అడవిలో ఉంది. దాని ఎదురుగా ఉధృతంగా సాగుతున్న నది ప్రవాహం కనిపించింది. ఆ నది ప్రవాహం ఒడ్డున ఎలుగుబంటి తీక్షణంగా చూస్తూ కనిపించింది. అంతటి ఉధృతమైన ప్రవాహంలోనూ ఆ ఎలుగుబంటి ఆ నీటినే చూస్తూ ఉంది. చాలా నిరీక్షణ తర్వాత ఒకసారి అది అంతటి ప్రవాహమైన నీటిలో ఒక్క మునుక వేసింది.

    చివరికి పట్టేసింది

    “ఎంత లోతులో ఉన్నా సరే వదిలేదే లేదు” అన్నట్టుగా చేపను పట్టేసింది. అంతే వేగంగా చేపను నోట కరచుకొని పైకి లేచింది. అంతే ఈరోజుకు కడుపునిండా ఆహారం దొరికింది అనుకొని అడవి లోపలికి వెళ్లి ఆ చాపను కడుపారా ఆస్వాదించింది. దీనికి సంబంధించి కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసి ఆనంద్ మహీంద్రా ఫీదా అయ్యారు.” మనలో చాలామందికి ఏకాగ్రత ఉండదు. అలాంటి వారికి ఈ వీడియో మంచి పాఠం లాంటిది. ఈ ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ధ్యానం, ఏకాగ్రత ఉంటే ఏ పని లో అయినా విజయం సొంతం చేసుకోవచ్చు” అని రాసి.. తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.

    రకరకాల వ్యాఖ్యలు

    అయితే ఆనంద్ మహీంద్రా ఈ వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ ఎలుగుబంటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ఎలుగుబంటి టాలెంట్ సూపర్. దానికి చాలా ఏకాగ్రత ఉంది అంటూ” కామెంట్లు చేస్తున్నారు. అన్నట్టు ఈ వీడియో ట్విట్టర్ లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.