Bengaluru: సాప్ట్ వేర్ జాబ్ అంటే ఇంతే మరీ.. థియేటర్ లో నూ ల్యాప్ టాప్ పై పనే!

ఇన్ స్టా గ్రామ్ లో "బెంగళూరు మలయాళీస్" అనే ఖాతా ఉంది. ఈ వీడియోను ఏప్రిల్ 10న ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటివరకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవడం లేదు. ఎందుకంటే బెంగళూరు నగరంలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందనేది వారి అభిప్రాయం.

Written By: Bhaskar, Updated On : April 27, 2023 7:30 am
Follow us on

Bengaluru: మనిషన్నాక కాస్తంత విశ్రాంతి ఉండాలి. మెదడు ఎటువంటి ఆలోచన చేయకుండా కూసింత రెస్ట్ తీసుకోవాలి. లేకుంటే మెంటల్ ఎక్కిపోద్ది. బుర్ర వేడితో బద్దలై పోతుంది.. అందుకే కదా “అదే పనిగా పని చేస్తే శరీరం ఒక యంత్రం లాగా తయారవుతుందని” పెద్దలు చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా శరీరాన్ని అతిగా కష్టపెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులయితే… చుక్కలు చూస్తున్నారు.. లే ఆఫ్ పేరుతో కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తీసేస్తున్నాయి. ఉన్న వారి మీద విపరీతమైన భారాన్ని మోపుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు సాప్ట్ వేర్ ఉద్యోగులు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

థియేటర్లోనూ..

మనం సాధారణంగా సినిమా కి ఎందుకు వెళ్తాం? మనకున్న టెన్షన్ లు మొత్తం పక్కన పెట్టి వినోదం కోసం, కాలక్షేపం కోసం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. కానీ బెంగళూరులో ఓ సినిమా థియేటర్లో ఐటీ ఎంప్లాయ్ ల్యాప్ టాప్ తో వచ్చాడు. సినిమా చూస్తూనే తన వర్క్ చేసుకున్నాడు.. అతడు కూర్చున్న సీట్ పై వరుసలో ఓ వ్యక్తి దీనిని వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇదీ మా టెకీల పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ గ్రూప్ ద్వారా వెలుగులోకి

ఇన్ స్టా గ్రామ్ లో “బెంగళూరు మలయాళీస్” అనే ఖాతా ఉంది. ఈ వీడియోను ఏప్రిల్ 10న ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటివరకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవడం లేదు. ఎందుకంటే బెంగళూరు నగరంలో ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందనేది వారి అభిప్రాయం. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి కంపెనీలు అడ్డగోలుగా ఉద్యోగాలు తీసివేస్తున్న నేపథ్యంలో ఉన్న వారిపై అధిక పని ఒత్తిడి పెరిగిందని సాప్ట్ వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఉన్న పని గంటల కంటే అదనంగా పని చేయిస్తున్నారని వారు అంటున్నారు.

ఆశలు అడుగంటుతున్నాయి

ఈ వీడియో లాగానే ఉంది బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల పరిస్థితి. ప్రాజెక్టులు లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి తక్కువ మానవ వనరులతో పనిచేయడం ఉన్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. గతంలో శనివారం, ఆదివారం ఐటి ఉద్యోగులకు సెలవులు ఉండేవి. కానీ లే ఆఫ్ పేరు చెప్పి తమతో ఎక్కువ పని చేయిస్తున్నారని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి ఆవేదన ఎంత చెప్పినా కంపెనీలు పట్టించుకోకపోవడంతో.. ఇలాంటి వీడియోలు వారిలో కనువిప్పు కలిగిస్తాయని ఐటి ఉద్యోగులు అంటున్నారు. కోవిడ్ ముందు ఐటీ ఉద్యోగులకు మంచి మంచి అవకాశాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో.. దాని ప్రభావం ఐటి పరిశ్రమపై మెల్లమెల్లగా పడింది. ఇప్పుడు ఉదృత రూపం దాల్చింది. ఫలితంగా సినిమా థియేటర్లోనూ ఐటీ ఉద్యోగులు ల్యాబ్ టాప్ మీద పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది.