MS Dhoni: ధోని ఫిట్ నెస్ కాపాడుకొనేందుకు ఓపెడతంగా ప్రయత్నిస్తుంటాడు. శరీరానికి ఎంత అవసరమో అంతకు తక్కువే తింటాడు. అయితే అలాంటి ధోనికి సరిగా రెండు సంవత్సరాలు క్రితం ఎడమ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత దానికి ధోని సర్జరీ చేయించుకున్నాడు. అప్పట్లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మోకాలి గాయంతో ఇబ్బంది పడినప్పటికీ ధోని అలానే ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత దానికి సంబంధించి సర్జరీ చేయించుకున్నాడు. కొంతకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కోలుకున్న తర్వాత మళ్లీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అయితే అది ఆరోగ్యానికి అంతగా శ్రేయస్కరం కాదని వైద్యులు చెప్పడంతో కొంతకాలం దూరంగా ఉన్నాడు. అనంతరం మళ్లీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అప్పట్లో ధోని కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. పరుగులు మాత్రం మెరుగ్గానే చేశాడు. ఇక గత సీజన్ లోనూ మోకాలి గాయం ఇబ్బంది పెట్టినట్టుంది. దీంతో కాళ్లకు బద్దలు కట్టుకొని మైదానంలోకి దిగాడు ధోని. గత సీజన్లోనూ చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెళ్లేవాడు.
Also Read: మహేంద్ర సింగ్ ధోని.. 43 ఏళ్ల వయసులో ఈ రికార్డులేంటి తలా?!
ఫిట్ గా ఉన్నట్టేనా
ధోని కుంటుకుంటూ నడవడంతో అతడి శరీర సామర్థ్యం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం వల్ల ధోని మోకాలి గాయం మళ్ళీ తిరిగి పెట్టిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మేనేజ్మెంట్ లేదా ధోని ప్రకటించలేదు. కాకపోతే వేగంగా పరిగెత్తడం వల్ల కాస్త మోకాలి దగ్గర ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తోంది. అందువల్ల ధోని కుంటుకుంటూ నడిచాడు. అయితే ఆ తర్వాత ధోనీని చెన్నై వైద్యులు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ” ధోని మోకాలి దగ్గర కాస్త ఇబ్బంది ఏర్పడింది. గతంలో అతడు ఆ ప్రాంతంలో శస్త్ర చికిత్స చేసుకున్నాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. మళ్లీ ఇప్పుడు క్రికెట్ ఆడటం వల్ల ఆ ప్రాంతంలో కాస్త ఇబ్బంది ఏర్పడింది. అయితే అది తాత్కాలికమే. అతడు కోలుకుంటున్నాడు. అతడి ఫామ్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అతడు తదుపరి మ్యాచ్లో అందుబాటులో ఉంటాడు. చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తాడని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరోవైపు ధోనికి ఏమీ కాలేదని.. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. కచ్చితంగా వచ్చే మ్యాచ్లో ఆడతాడని చెన్నై అభిమానులు అంటున్నారు. వదంతులను నమ్మకూడదని సూచిస్తున్నారు. ” ధోని ఈ వయసులో అలా పరిగెత్తడం వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడినట్టుంది. అయినా ఈ వయసులోనూ అతడు ఈ విధంగా క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. అలాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. అందులో ధోని కి ప్రథమ స్థానం దక్కుతుందని” సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
View this post on Instagram