MS Dhoni: ధోని బలమైన నాయకుడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అమలులో పెట్టే కెప్టెన్. అందువల్లే 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో చెన్నై జట్టు మేనేజ్మెంట్ అతడిని వదులుకోవడానికి ఒప్పుకోవడం లేదు. చివరికి వీల్ చైర్ మీద ఉన్న సరే క్రికెట్ ఆడించడానికి రెడీగా ఉంది. వాస్తవానికి 43 సంవత్సరాలు వయసులో ఒక వ్యక్తి క్రికెట్ యాక్టివ్ గా అంత సులభమైన విషయం కాదు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి టోర్నీలలో అలా ఆడటం సాధ్యం కాదు. కానీ దానిని ధోని తిరగరాస్తున్నాడు. కుర్రాళ్ళకు మించి సామర్థ్యాన్ని చూపిస్తూ.. సరికొత్త ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. కీపింగ్ లో మాత్రమే కాదు.. బ్యాటింగ్ లోనూ అదరగొడుతున్నాడు. ధోని వేగం చూసి కుర్రాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారంటే.. అతడి ఆడతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆపద్బాంధవుడి పాత్ర పోషించి చెన్నై జట్టును ధోని గెలిపించాడు. ఇక ఇదే క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
Also Read: ముంబై, చెన్నై, హైదరాబాద్.. జాతి రత్నాలు.. వీడియో వైరల్
రికార్డులను తిరగ రాశాడు
ధోని లక్నోతో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలిపించడం మాత్రమే కాదు.. రికార్డులను బద్దలు కొట్టాడు. సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 200 డిస్మిసల్స్ (స్టంప్ అవుట్లు, క్యాచ్ అవుట్లు, రన్ అవుట్లు) చేసిన తొలి వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ లీగ్ ప్రారంభించి అత్యధిక ఇన్నింగ్స్ లలో 132 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడుగా నిలిచాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు (18) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు గెలుచుకొని.. ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడుగా ఉన్నాడు. ఇక ఈ జాబితాలో 19 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. లక్నో జుట్టు పై బ్యాటింగ్ చేసి 11 బాల్స్ మాత్రమే ఎదుర్కొని ధోని 26 రన్స్ కొట్టేసాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు అతడిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ పురస్కారం అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్ (43 సంవత్సరాల 281 రోజులు) గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. గతంలో ఈ ఘనత లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే (43 సంవత్సరాలు 60 రోజులు) పేరు మీద ఉండేది. అయితే ఈ అవార్డు అందించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా.. ధోని సున్నితంగా తిరస్కరించాడు..” అసలు మీరు నాకు ఎందుకు అవార్డు ఇస్తున్నారు.. ఈ అవార్డు నాకు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి.. నాకంటే గొప్పగా నూర్ అహ్మద్ ఆడాడు. అతడు గొప్పగా బౌలింగ్ చేశాడు. అతడు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటువంటి ఆటగాడికి మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తే దానికి విలువ కూడా పెరుగుతుందని” ధోని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ధోనికే అవార్డు ఇవ్వడానికి ఆసక్తి చూపించారు..
Also Read: కాటేరమ్మ కొడుకంటే ఎవరో క్లాసెన్ కు తెలిసిపోయింది.. వైరల్ వీడియో