MS Dhoni: అయితే వయసు పెరుగుతున్నా కొద్ది మరింత చిన్నపిల్లలవుతారు. మరింత చిలిపిగా తయారవుతారు. ఈ జాబితాలో మహేంద్రసింగ్ ధోనికి మొదటి స్థానం ఉంటుంది కావచ్చు. ఎందుకంటే అతడు మరింత చిలిపిగా తయారవుతున్నాడు. ఆ మధ్య నిర్మాతగా మారి ధోని ఓ సినిమా తీశాడు. తమిళంలో ఆ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో ప్రముఖ తమిళ కమెడియన్ యోగి బాబు ముఖ్యపాత్ర పోషించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో యోగి బాబు జన్మదిన వేడుకలు జరిపారు. ఆ సమయంలో కేక్ కటింగ్ వేడుకకు ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడ ఏర్పాటు చేసిన చాక్లెట్ కేక్ ను యోగి బాబు కంటే ముందుగానే ధోని రుచి చూశాడు. దీంతో యోగి బాబు జాలిగా ముఖం పెట్టాడు.. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు కారణమైంది. అంతేకాదు ధోనిలో ఉన్న అసలు సిసలైన చిలిపితనాన్ని ఆ వీడియో బయటపెట్టింది.. మళ్లీ ఇప్పుడు ధోని తనలో ఉన్న చిలిపితనాన్ని మరోసారి జనాలకు చూపించాడు. ప్రస్తుత ఐపీఎల్ కాలంలో ధోని తనలో ఉన్న కొంటెతనాన్ని ఎలా బయట పెట్టాడంటే..
Also Read: మహేంద్ర సింగ్ ధోని.. 43 ఏళ్ల వయసులో ఈ రికార్డులేంటి తలా?!
రోబోను ఆటపట్టించాడు
సోమవారం లక్నో జట్టుతో మ్యాచ్ ప్రారంభ ముందు ధోని గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో ధోనికి నాలుగు కాళ్లతో నడిచే రోబో కెమెరా అతనికి ఎదురు వచ్చింది. దీంతో సంబరపడిన ధోని.. అన్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతేకాకుండా దానిని ఒక వైపు పడుకోబెట్టాడు. ఇంకేముంది రోబో పైకి లేవలేకపోయింది. దానిని అలా చూస్తూ ఉన్న ధోని నవ్వుకున్నాడు. కిలోగా మైదానంలోకి ఆపరేటర్ వచ్చి.. అలా పడుకొని పోయిన రోబో ను పైకి లేపాడు. ఆ తర్వాత ఆ రోబో ఫోటోలు తీయడం మొదలు పెట్టింది.. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన వారంతా ధోనిలో ఇంకా చిలిపితనం పోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.” 40 కి పైగా సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ధోని ఏమాత్రం తన చిలిపితనాన్ని కోల్పోవడం లేదు. కొంటెతనాన్ని ప్రదర్శించడం ఆపడం లేదు. మైదానంలో తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. చివరికి ఫోటోలు తీసే రోబోతో ఆటలాడుతున్నాడు. ధోని అంటే మామూలు విషయం కాదు. ధోని గొప్ప ఆటగాడు మాత్రమే కాదు. అంతకు మించిన చిలిపి కూడా. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే ధోనిలో మరో వ్యక్తి కనిపిస్తాడు. ఇలాంటి వీడియోలు చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంటాయి. అంతేకాదు ధోని మీద ప్రేమను మరింత పెంచుతాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram