Star Heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలను అందుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు వచ్చిన అవకాశాలను వదలకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతారు. అలాగే మరి కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం చాలా ఆచితూచి సినిమాలు చేస్తూ విజయం అందుకుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకుంటుంది. ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ అయ్యాయి. సినిమా సినిమాకు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంటుంది. తొలి సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఈమె నటించిన మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. తెలుగుతోపాటు తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ.
ఈ బ్యూటీ మరెవరో కాదు 2016లో పాప్ కార్న అనే మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ షైన్ టామ్ చాకో సరసన నటించిన. ఆ తర్వాత కలరి అనే తమిళ సినిమాతో 2018లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో సంయుక్తా మీనన్ భీమ్లా నాయక్ అనే సినిమాలో రానా దగ్గుబాటి భార్యగా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో తన అమాయకమైన నటనతో సంయుక్త మీనం అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత ఈ చిన్నది బింబిసారా, సార్, విరుపాక్ష అనే సినిమాలలో నటించే వరుసగా విజయాలను అందుకుంది.
ప్రస్తుతం ఈ చిన్నది నిఖిల్ సిద్ధార్థ కు జోడిగా స్వయంభు అలాగే కళ్యాణ్ రామ్ కు జోడిగా బింబిసారా 2 సినిమాలలో నటిస్తుంది. అలాగే ఈమె ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా కనిపించబోతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమాలో పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమాలో కూడా సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు టాక్. అలాగే మరొక స్టార్ హీరో సినిమాలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య హీరోగా నటిస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడా సంయుక్త మీనన్ కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
View this post on Instagram