Tollywood Heroine : సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత కనిపించకుండా కనుమరుగైపోతూ ఉంటారు చాలామంది ముద్దుగుమ్మలు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కేవలం కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు చేశాం అన్నది ముఖ్యం కాదు వాళ్లకు ఎంత క్రేజ్ వచ్చింది అనేది చాలా ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోరు. కానీ మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం కేవలం ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ బ్యూటీలు తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి కొంతమంది మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేరు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. ఈమె తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
Also Read : తల్లి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈమె సొంతం..
అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కూడా అయ్యాయి. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హవా నడుస్తుంది. వీళ్ళు మంచి అవకాశాలు అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీళ్లలో శాన్వి మేఘన కూడా ఒకరు అని చెప్పొచ్చు. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో శాన్వి మేఘన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగులో పిట్ట కథలు, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పుష్పక విమానం సినిమాలో శాన్వి మేఘన షార్ట్ ఫిలిం హీరోయిన్ గా చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా అలరించింది.
తెలుగులో ఇప్పటివరకు శాన్వి ఆరు సినిమాలలో నటించింది. అలాగే తమిళ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. తమిళ్ లో శాన్వి మేఘన కుటుంబ స్థాన్ అనే సినిమాలో నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ చిన్నది తెలుగులో అనే సినిమాలో నటించింది. ఇప్పటివరకు శాన్వి మేఘన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన కూడా ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడానికి శాన్వి రకరకాలుగా ప్రయత్నిస్తుంది.
View this post on Instagram