Ms Dhoni : ఇక ఐపీఎల్ లోను చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో ధోని కృషి చేశాడు. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంది. ఐపీఎల్ లోనే అత్యంత విలువైన జట్లలో ఒకటిగా పేరుపొందింది. విపరీతమైన అభిమానులు ఉన్న జట్టుగా కూడా చెన్నై పేరు తెచ్చుకుంది. 2008 నుంచి ఇప్పటివరకు కూడా ధోని చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. ఒకరకంగా ధోనికి, చెన్నై జట్టుకు అవినాభావ సంబంధం ఉంది. అందువల్లే ఆ జట్టు ఐపీఎల్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ధోని బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా మూడు భాగాలలో తనదైన మార్క్ చూపిస్తాడు కాబట్టే చెన్నై జట్టు అత్యంత బలమైన టీం గా రూపొందింది. ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్నప్పటికీ.. వచ్చే రోజుల్లో జరిగే మ్యాచ్లలో పుంజుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేనిది. ఎందుకంటే ఇప్పటికి కూడా చెన్నై జట్టు ధోని మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచింది..” నా వయసు 43 సంవత్సరాలు. ఒకవేళ నేను ఆసుపత్రిలో ఉన్నప్పటికీ..బెడ్ పై నుంచి నన్ను లేపుకొచ్చి క్రికెట్ ఆడిస్తారని” ఇటీవల ధోని చెన్నై జట్టు మేనేజ్మెంట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారంటే.. ధోనికి, చెన్నై జట్టుకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఆ స్టార్లతో మళ్లీ ఆడాలని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్టర్ కూల్!
గూస్ బంప్స్ వీడియో
ధోని వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడటం వల్ల ఇటీవల అతడు కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. గత సీజన్లోనూ అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు కాళ్లకు ప్రత్యేకంగా పట్టిలు కట్టుకొని.. మైదానంలోకి దిగాడు. అంతేకాదు వెన్నెముకకు కూడా ప్రత్యేకమైన పట్టి ధరించాడు. ఇక తాజాగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని శివం దూబే అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చాడు. కాన్వే (69) తో కలిసి 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కాన్వే అవుట్ అయ్యాడు. పంజాబ్ జట్టుతో చెన్నై తలపడిన మ్యాచ్లో ధోని 12 బంతుల్లో 27 రన్స్ కొట్టేశాడు. అతడు ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే ధోని బ్యాటింగ్ కు వచ్చే ముందు కాళ్లకు వైద్యులు సూచించిన పట్టీలు కట్టుకున్నాడు. ఇక ఈ వీడియోను ధోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ” ధోని వయసు 43 సంవత్సరాలు. అతడికి ప్రస్తుతం అన్నీ ఉన్నాయి. కానీ అతడు కేవలం అభిమానుల కోసం మాత్రమే ఐపీఎల్ ఆడుతున్నాడు. చెన్నై అభిమానులను ఆనందంలో ముంచడానికి అతడు ఐపిఎల్ లో చెన్నై తరఫున ఆడుతున్నాడు. అటువంటి ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈతరం ధోని గురించి తెలుసుకోవాలి. ధోని బాటలో నడవాలి. ఎందుకంటే అతడు వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి జట్టు కోసం మాత్రమే ఆడతాడు. ఎందుకంటే అతడు ధోని కాబట్టి” అని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు, ధోని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : CSK కెప్టెన్ గా ధోని.. కారణమిదే.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..
He is not fit but still playing for his fans. ♥️ pic.twitter.com/H1dAaF8ySU
— mufaddla parody (@mufaddl_parody) April 8, 2025