Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu)…ఈ సినిమా విడుదలకు మోక్షం కలిగేది ఎప్పుడో పాపం ఆ చిత్ర దర్శక నిర్మాతలకు కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడో 2021 వ సంవత్సరం లో ఈ సినిమాని మొదలు పెట్టారు. అప్పట్లో షూటింగ్ చాలా వేగంగానే జరిగింది. మధ్యలో లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి షూటింగ్ కార్యక్రమాలు ఆగిపోయాయి. లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలైన కొన్నాళ్ళకు ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు. దాదాపుగా 50 రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చాలా పెద్ద గ్యాప్ వచ్చింది.
Also Read : ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు..’హరి హర వీరమల్లు’ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!
ఈ సినిమాకు ఆయన డేట్స్ ని కేటాయించలేని పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి అయ్యాక గత ఏడాది సెప్టెంబర్ నెలలో పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. మళ్ళీ డిసెంబర్ నెలలో కొన్ని రోజులు షూట్ చేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ ఊసే ఎత్తలేదు. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయితే, ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాకపోవడం తో మే9 కి వాయిదా వేశారు. చెప్పిన డేట్ కి విడుదల చేయడం కోసం మూవీ రేయింబవళ్లు కష్టపడి, నిద్రాహారాలు మానుకొని మరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన పార్ట్ ని పూర్తి చేయడానికి డేట్స్ ని కేటాయించాడు. అరకు పర్యటన ముగిసిన తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని నిర్మాతలకు చెప్పాడు కూడా. సినిమా షూటింగ్స్ కోసం పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేసి చాలా సన్నబడ్డాడు కూడా.
ఆయన లుక్స్ లో అనూహ్యమైన మార్పులు రావడాన్ని చూసి అభిమానులు సంతోషించారు, షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు, ఈసారి ‘హరి హర వీరమల్లు’ చెప్పిన డేట్ కి వచ్చేస్తుందని సంబరపడ్డారు. కానీ ఇంతలోపే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కి సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా గాయపడడం, నిన్న రాత్రి ఆయన హుటాహుటిన సింగపూర్ కి పయనం అవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన సింగపూర్ నుండి ఎప్పుడు ఇండియా కి తిరిగి వస్తాడో?, వచ్చిన తర్వాత ఆయన మూడ్ ఎలా ఉంటుందో, షూట్ లో పాల్గొంటాడో లేదో అని నిర్మాతలు భయపడిపోతున్నారు. ఇప్పటికే 12 సార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఇంకోసారి వాయిదా పడితే అభిమానులు కూడా ఈ చిత్రాన్ని పట్టించుకోని పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రాన్ని మే 16న కానీ, లేదా మే 23న కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read : ‘హరి హర వీరమల్లు’ సెన్సార్ డేట్ వచ్చేసింది..ఇక విడుదల లాంఛనమే!