Ms Dhoni
Ms Dhoni : 17 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది.. ఐదుసార్లు కూడా చెన్నై జట్టుకు ధోని (Mahendra Singh Dhoni) నాయకత్వం వహించాడు. జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టును గురించి చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని దక్కించుకుంది. గత సీజన్లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా తప్పుకున్నాడు. జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. గత సీజన్లో రుతు రాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఈ సీజన్లోనూ అతడే కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని చెన్నై జట్టు భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పటిష్టమైన ప్రణాళికలు రూపొందించింది.. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండో మ్యాచ్లో ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయింది. శుక్రవారం చెన్నైలోనే చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు పై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై వేదికగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో 17 సంవత్సరాల తర్వాత ఓటమిపాలైంది.. అయితే ఈ మ్యాచ్లో ధోని ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది.. ధోని మెరుగ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ అతడి అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : కట్టప్పలా చాహర్.. బాహుబలి లా ధోని.. వైరల్ వీడియో
ముందే వచ్చి ఉంటే..
చెన్నై జట్టు తరుపున ధోని ముందే బ్యాటింగ్ కు వచ్చి ఉంటే గెలిచేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” చెన్నై జట్టు 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు 16 బంతుల 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కఠినమైన చెన్నై పిచ్ పై 43 సంవత్సరాల వయసులో ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు. జట్టు మేనేజ్మెంట్ ముందే కనుక పంపించి ఉంటే బాగుండేది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కంటే ధోని ముందు వచ్చి ఉంటే కచ్చితంగా చెన్నై గెలిచేది. కానీ అలా జరగకపోవడం వల్ల చెన్నై ఓటమిపాలైంది. మరీ దారుణంగా బెంగళూరు చేతిలో సొంత మైదానం లో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడమే అసలైన దారుణం. ఇప్పటికైనా చెన్నై జట్టు యాజమాన్యం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ధోని ని ముందే బ్యాటింగ్ కు పంపించాలి. అప్పుడైతేనే చెన్నై జట్టుకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవని” సోషల్ మీడియాలో ధోని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. ధోని సేవలను చెన్నై జట్టు యాజమాన్యం వినియోగించుకోవాలని.. ఈసారి ట్రోఫీ గెలవాలంటే కెప్టెన్ కాకపోయినప్పటికీ ధోని జట్టును ముందుండి నడిపించాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : అదే ధోని విజయ రహస్యం.. సురేష్ రైనా