https://oktelugu.com/

Ugadi 2025: ఉగాది రోజు ఈ పనులు చేస్తే.. దరిద్రమంతా మీతోనే

Ugadi 2025 కొందరు ఉగాది రోజు ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్త ఏడాది నాడు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు.

Written By: , Updated On : March 29, 2025 / 09:20 AM IST
Ugadi 2025

Ugadi 2025

Follow us on

Ugadi 2025: హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైనది. తెలుగు వారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతీ ఒక్క హిందువులు జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే హిందువుల కొత్త సంవత్సరం ఉగాది చైత్ర మాసంలోని శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతుంది. హిందూ మతానికి చెందిన ప్రజలు ఈ రోజును చాలా ప్రత్యేకంగా కొత్త దుస్తులు, కొత్త వస్తువులతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఉగాది పండుగను కొన్ని నియమ నిష్టలతో చేయాలి. తెలిసో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఉగాది రోజు కొన్ని తప్పులు చేస్తే దరిద్రం అంటుకుంటుందని పండితులు అంటున్నారు. తెలియక చిన్న తప్పు చేస్తే దురదృష్టం వస్తుంది. అయితే ఉగాది రోజు చేయకూడని ఆ పనులు ఏంటో చూద్దాం.

Also Read: రాశి వారికి ఈ రోజు లాభాలే లాభాలు.. పట్టిందల్లా బంగారమే..

ఇంటిని శుభ్రం చేయకూడదు
కొందరు ఉగాది రోజు ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్త ఏడాది నాడు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఇంటిని శుభ్రం చేయవద్దు. ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. కొందరు పూజ చేసే ముందు ఇంటిని శుభ్రం చేస్తారు. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని అంటున్నారు.

మద్యం, మాంసాహారం
ఉగాది నాడు మద్యం, మాంసాహారం తినకూడదని పండితులు చెబుతున్నారు. తెలుగు పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకతమైనది. ఇలాంటి గొప్ప రోజున మద్యం, మాంసాహారం తింటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు, దరిద్రం అంతా కూడా చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు మద్యం, మాంసాహారం తీసుకోవద్దని పండితులు అంటున్నారు.

అప్పు ఇవ్వడం, తీసుకోవడం
ఉగాది రోజు అప్పు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయకూడదని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ ఉగాది రోజున అప్పు ఇస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పు ఇస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. ఉగాది రోజు అప్పు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. ఈ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక వేళ అప్పు తీసుకున్నా కూడా తీరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు అప్పులు ఇవ్వవద్దు, తీసుకోవద్దని పండితులు అంటున్నారు.

గొడవలకు వెళ్లకూడదు
ఉగాది రోజు గొడవలకు వెళ్లవద్దు. తొలి పండుగ రోజు సంతోషంగా ఉండాలి. అంతే కానీ గొడవలకు దిగి సంతోషాన్ని కోల్పోవద్దు. ఉగాది రోజు గొడవలకు దిగితే ఏడాది అంతా కూడా గొడవ పడుతూనే ఉంటారని పండితులు అంటున్నారు.

చెత్తను బయట వేయడం
ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదని పండితులు అంటున్నారు. ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయడం వల్ల ఇంట్లో ఉన్న సంపద, లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని నమ్ముతుంటారు. కాబట్టి ఈ రోజున ఇంట్లో ఉన్న చెత్తను అసలు బయట పడేయవద్దు.

చిరిగిన దుస్తులు ధరించకూడదు
ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించాలి. చిరిగిన దుస్తులు ధరిస్తే ఇంట్లోకి దరిద్రం వస్తుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిన దుస్తులు అసలు ధరించవద్దు.