https://oktelugu.com/

Ms Dhoni : అదే ధోని విజయ రహస్యం.. సురేష్ రైనా

Ms Dhoni : చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోనిది. అందువల్లే అతడిని చెన్నై అభిమానులు తల అని పిలుస్తారు. గత సీజన్లో ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

Written By: , Updated On : March 21, 2025 / 08:51 AM IST
Ms Dhoni , Suresh Raina

Ms Dhoni , Suresh Raina

Follow us on

Ms Dhoni : చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోనిది. అందువల్లే అతడిని చెన్నై అభిమానులు తల అని పిలుస్తారు. గత సీజన్లో ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానాన్ని రుతు రాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. గత సీజన్లో చెన్నై జట్టు మెరుగైన ఆట తీరు ప్రదర్శించింది. కాకపోతే డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడ లేకపోయింది. 2023 సీజన్లో చెన్నై జట్టు అద్భుతమైన ఆట తీరు కొనసాగించింది. ఫైనల్ దాకా వెళ్ళిన చెన్నై.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ జట్టును ఓడించింది. ఉత్కంఠ పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కొని విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబైతో సంయుక్తంగా చెన్నై కొనసాగుతోంది. చెన్నై జట్టుకు ప్రస్తుతం గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గైక్వాడ్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడని.. ఈసారి విజేతగా నిలుపుతాడని చెన్నై జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నది.

Also Read : ‘యానిమల్’ అవతారం లో MS ధోని..ఇక సినిమాల్లోకి వచ్చేయొచ్చు!

అదే అతని విజయ రహస్యం

చెన్నై జట్టుకు ధోని కెప్టెన్ కాకపోయినప్పటికీ.. అతని ఆధ్వర్యంలోనే జట్టు నడుస్తోంది. జట్టుకూర్పు విషయంలో ధోని ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కోచింగ్ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నాడు. వాస్తవానికి ధోని ఈ సీజన్లో ఆడేది అనుమానమేనని వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ నిరాధారమని చెన్నై జట్టు స్పష్టం చేసింది. అంతేకాదు ధోనిని జట్టులోనే కొనసాగించింది. ఇక ధోని వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు దాటినప్పటికీ.. అతడు అదే ఉత్సాహంతో క్రికెట్ ఆడుతున్నాడు. గత నెల రోజుల నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రఫ్ పిచ్ లపై విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.. అయితే ఇదే విషయాన్ని సురేష్ రైనా తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.. సురేష్ రైనా గతంలో చెన్నై జట్టుకు ఆడాడు. ధోనితో సురేష్ రైనాకు మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ జాతీయ జట్టులోనూ గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. ఇటీవల కాలం వరకు చెన్నై జట్టుకు కూడా ఆడారు. అయితే సురేష్ రైనా తప్పుకున్నప్పటికీ.. ధోని మాత్రం చెన్నై జట్టులోనే ఆడుతున్నాడు. ధోని ఐపీఎల్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. అయితే అతడు గతంలో మాదిరిగానే రకరకాల పిచ్ లు, రకరకాల బౌలర్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని సురేష్ రైనా వివరంగా చెప్పాడు.. క్రికెట్ మ్యాచ్ ఉంటే ధోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటాడని.. మానసిక ప్రశాంతతను కోరుకుంటాడని.. శారీరకంగాను తీవ్రంగా సాధన చేస్తాడని చెప్పుకొచ్చాడు. ధోని ఇలా వ్యవహరించడం వల్లే అతడు అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయ్యాడని సురేష్ రైనా పేర్కొన్నాడు. ధోని మైదానంలో ఉన్నప్పుడు మ్యాచ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాడని.. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం అన్ని విషయాల గురించి చర్చిస్తాడని.. వ్యూహాల గురించి మాట్లాడేటప్పుడు తనకంటూ ఒక ప్రణాళిక ఉంటుందని సురేష్ రైనా వివరించాడు. ధోని వయసు నలభై సంవత్సరాలు దాటిపోయినప్పటికీ.. అతడు ఇప్పటికీ పాతిక సంవత్సరాల యువకుడి లాగే ఆడుతుంటాడని.. ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ధోనిలో క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంటుందని సురేష్ రైనా వివరించాడు. అయితే ఈసారి ఐపీఎల్ లో చెన్నై జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇదే క్రమంలో సురేష్ రైనా చెన్నై జట్టు పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

Also Read : అంబటి రాయుడు పంపిన బిర్యానీ కోసం హోటల్ మార్చేసిన ధోని పౌరుషం..