https://oktelugu.com/

Mike Tyson Vs Jake Paul: టైసన్‌కు షాక్‌.. బౌట్‌లో చిత్తు చేసిన యువ బాక్సర్‌..

ప్రపంచ బాక్సింగ్‌ ఫ్యాన్స్‌.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీ జరిగింది. ప్రపంచ అగ్ర బాక్సర్‌ మైక్‌ టైసన్‌ చాలా ఏళ్ల తర్వాత బౌట్‌లోకి దిగాడు. అతనికి సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్‌ జేక్‌ పాల్‌ షాక్‌ ఇచ్చాడు.

Written By: Raj Shekar, Updated On : November 16, 2024 2:09 pm
Mike Tyson Vs Jake Paul(1)

Mike Tyson Vs Jake Paul(1)

Follow us on

Mike Tyson Vs Jake Paul: తరాల యుద్ధంగా మాజీ హెవీవెయిట్‌ ఛాంపియన్‌ టైసన్, అతని వయస్సులో దాదాపు సగం వయస్సులో ఉన్న వర్ధమాన తార జేక్‌ పాల్‌ను ఒకచోట చేర్చింది. టెక్సాస్‌లోని ఆర్లింగ్‌టన్‌లోని ఏటీ అండ్‌ టీ స్టేడియంలో శుక్రవారం మ్యార్‌ జరిగింది. మ్యాచ్‌కు ముందు.. ఇద్దరి వెయిట్‌ చూసుకునే సమయంలో టైసన్‌జేక్‌ పాల్‌ను చెప్పదెబ్బ కొట్టాడు. దీంతో పోటీపై ఉత్కంఠ పెరిగింది. 27 ఏళ్ల యూట్యూబర్‌ బాక్సర్‌గా మారిన జేక్‌ పాల్‌.. అతని వయసుకు రెట్టిపు వయసు ఉన్న 58 ఏళ్ల మైక్‌ టైసన్‌తో తలపడ్డాడు. జులై 20న జరగాల్సి ఉండగా, టైసన్‌కు గాయం కావడంతో వాయిదా పడింది. టైసన్‌ 2005లోనే రిటైర్‌ అయ్యారు. 19 ఏళ్ల తర్వాత మళ్లీ బౌట్‌లోకి దిగాడు.

మాజీ ఛాంపియన్‌కు షాక్‌..
ఈ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. టెక్సాస్‌లో జరిగిన బిగ్‌ బౌట్‌లో మౌక్‌ టౌసన్‌ను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్, యువ బాక్సర్‌ జేక్‌పాల్‌ చిత్తు చేశాడు. బౌట్‌లో ఖంగుతినిపించాడు. ఈ మ్యాచ్‌లో టైసన్‌.. యువ బాక్సర్‌ జేక్‌పాల్‌ చేతిలో 74–78 తేడాతో ఓడించాడు. ఈ గేమ్‌లో టైసన్‌ వయసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్‌ తనకంటే 37 ఏళ్ల చిన్నవాడు అయిన జేక్‌ సూపర్‌ పంచ్‌లను తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్లలో టైసన్‌ ఆధిపత్యం కనబర్చాడు. తర్వాత 8 రౌండ్లలో జేక్‌ పాల్‌ తన బాక్సింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శించాడు.

పంచ్‌ ఇవ్వలేకపోయిన టైసన్‌..
మైక్‌ టైసన్‌ తొలుత కొన్ని మంచి పంచులు ఇచ్చినా.. తర్వాత జేక్‌ పాల్‌కు తిరిగి పంచులు ఇవ్వలేకపోయాడు. బౌన్స్‌ బ్యాక్‌ కాలేక చతికిల పడిన టైసన్‌పై జేక్‌పాల్‌ పంచులతో విరుచుకు పడ్డాడు. దీంతో ఏ దశలోనూ టైసన్‌ ఆధిపత్యం కనబర్చలేదు. యువ బాక్సర్‌ చేతిలో చిత్తయ్యాడు. అయితే గెలిచిన తర్వాత జేక్‌ పాల్‌.. మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌కు తలవంచి నమస్కరించాడు. టైసన్‌ కూడా పాల్‌ను ఫైటర్‌గా కొనియాడారు. జేక్‌ పాల్‌కు 40 మిలియన్‌ అమెరికా డాలర్లు ప్రైజ్‌ మనీగా అభించింది.

నెట్‌ఫ్లిక్స్‌ క్రాష్‌..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ను నెట్‌ఫ్లిక్స్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది. మ్యాచ్‌ ప్రారంభం కాగానే, నెట్‌ఫ్లిక్‌కు వ్యూవర్స్‌ పోటెత్తారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాం క్రాష్‌ అయింది. చాలా మంది మ్యాచ్‌ ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు.