https://oktelugu.com/

singers : ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ టాప్ సింగర్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు !

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్నటువంటి సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 16, 2024 / 02:07 PM IST

    Top singers of Tollywood who got married secretly without anyone knowing.. Photos are going viral!

    Follow us on

    singers :  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్నటువంటి సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారు అనే విషయం సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది కానీ, ఇంత తొందరగా పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు కలిసి గతంలో ఎన్నో పాటలు పాడారు. అలా వాళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది. వీళ్ళు పాడిన పాటల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ లోని ‘ఉండిపో’, ఆచార్య చిత్రంలోని ‘నీలాంబరి’ వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి.

    అనురాగ్ కులకర్ణి స్టార్ మా ఛానల్ ప్రసారమయ్యే ‘సూపర్ సింగర్ సీజన్ 8’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సీజన్ టైటిల్ విన్నర్ కూడా ఆయనే అవ్వడంతో అనురాగ్ పేరు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపించింది. అలా పాపులారిటీ ని సంపాదించిన ఆయన 2016 వ సంవత్సరంలో ఏకంగా నాలుగు సినిమాలకు పాటలు పాడే అదృష్టం దక్కింది. అవి పెద్ద హిట్ అవ్వడంతో ఇక అనురాగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2017 వ సంవత్సరం లో 18 సినిమాలకు పాటలు పాడి ఇండస్ట్రీ లో నేటి తరం సింగర్స్ లో నెంబర్ 1 నిలిచాడు. అలా ఆయన ఈ 9 ఏళ్ళ సినీ కెరీర్ లో 250 కి పైగా పాటలు పాడాడు. ఈ ఒక్క ఏడాది ఆయన 9 సినిమాలకు పాటలు పాడాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు.

    ఇక రమ్య బెహరా విషయానికి వస్తే ఈమె అనురాగ్ కంటే సీనియర్ సింగర్ అనే చెప్పాలి. 2013 వ సంవత్సరంలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పాడిన ‘కొత్తగున్నా హాయి నువ్వా’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈమె ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో పాటలు పాడింది. వాటిల్లో బాహుబలి సిరీస్ కూడా ఉంది. రీసెంట్ గా విడుదలై సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న ‘అమరన్’ చిత్రంలో ఒక పాట కూడా పాడింది. గత ఏడాది వరకు ఫుల్ బిజీ గా ఉన్న ఈమె, ఎందుకో ఈ సంవత్సరం చాలా సెలెక్టివ్ గా పాటలను ఎంచుకుంటుంది. ఇలా ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ సింగర్స్ గా చలామణి అవుతున్న వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.