https://oktelugu.com/

Air India: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌.. ఆ ఎయిర్‌ పోర్టుల నుంచి సర్వీస్‌ల పెంపు..

విమాన ప్రయాణం మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటలోకి వస్తోంది. ఆదాయం పెరగంతో చాలా మంది మిడిల్‌ క్లాస్‌ ప్రజలు కూడా విమానం ఎక్కలన్న కల నెరవేర్చుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 16, 2024 / 02:19 PM IST

    Air India

    Follow us on

    Air India: విమానం ఎక్కేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అవసరాల కోసం చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటే.. విమానం ఒక్కసారైనా ఎక్కాలనుకునేవారు కూడా పెరుగుతున్నారు. దీంతో మిడిల్‌ క్లాస్‌ ప్రజలు చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నవారు పెరుగుతున్నారు. దీంతో విమానాశ్రయాలు రద్దీగా మారుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచే సగటున రోజుకు పది వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా మెరుగైన సర్వీస్‌లు అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌.. తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన విమానాశ్రయాల నుంచి విమాన సర్వీస్‌లు పనెంచుతున్నట్లు ప్రకటించింది.

    మూడు ఎయిర్‌ పోర్టుల నుంచి..
    తెలంగాణలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌ పోర్టుల నుంచి విమాన సర్వీసులను గణనీయంగా పెంచాలని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఈమూడు ఎయిర్‌ పోర్టుల నుంచి 173 సర్వీస్‌లు నడుపుతున్నట్లు తెలిపింది. శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా 40 శాతం సర్వీస్‌లు పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అంటే ఇకపై 250 సర్వీస్‌లు నడుపుతామని వెల్లడించింది.

    ఈ నగరాలకు..
    విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌కు హైదరాబాద్‌ నుంచి నేరుగా సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, కొచ్చి సర్వీస్‌లు పెరగనున్నాయి. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అంకుర్‌ గార్గ్‌ తెలిపారు. ప్రతీవారం 200 సర్వీసులతో తమ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌తో మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి 17 దేశీయ విమానావ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌ పోర్టులకు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

    విజయవాడ, విశాఖపట్నం నుంచి..
    ఇక విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీస్‌లు నడుపుతామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. విశాఖపట్నం నుంచి ప్రతీ వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా శీతాకాల సీజన్‌లో ఎయిర్‌ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు తెలిపింది. గతేడాది ఇదే సీజన్‌లో 325 రోజువారీ సర్వీసుల నిర్వహించింది.