Liquor rates : ఆదివారం వచ్చిందంటే చాలు మందు బాబులకు మొక్క లేనిదే ముద్ద దిగదు. ఈ ముక్కతోపాటు చుక్క కూడా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి ఆదివారం మద్యం అమ్మకాలు పుంజుకుంటాయి. అయితే ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో చల్లదనం కోసం చాలామంది బీర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల బీర్ల ధరలు 10 నుంచి 20% పెంచినా వాటి కొనుగోళ్ళు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీంతో చుక్క బాబులకు చిక్కులే అని కొందరు అంటున్నారు. ఇంతకీ మద్యం రేట్లు ఎంతగా పెరుగుతున్నాయి అంటే?
Also Read : భూభారతి పోర్టల్‌తో ల్యాండ్ రికార్డ్స్ తనిఖీ.. ఇలా తెలుసుకోండి
వేసవికాలంలో ఎక్కువగా మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. సెలవులు ఉండటం తో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మద్యం అమ్మకాలు పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యం రేట్లు పెంచేందుకు సమాయత్తమవుతుంది. గత ఫిబ్రవరిలో బీర్లపై పది నుంచి 20% పెంచింది. దీంతో బీర్ల అమ్మకాలు తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. కానీ ధరలతో సంబంధం లేకుండా చాలామంది బీర్లను ఎప్పటిలాగే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
అయితే ఈ లిక్కర్ దారులు సామాన్యులపై భారం కాకుండా పెంచాలని చూస్తున్నారు. అంటే లిక్కర్ కనీసం రూ. 500 పైన ఉన్న వాటిపైనే ధరలు పెంచే అవకాశం ఉంది. ఆలోపు ధరలు పెరగవాని తెలుస్తుంది. లిక్కర్ తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరగడంతో మద్యం తయారు చేసే కంపెనీలు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మద్యం ధరలను 15% పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ధరలు ఎక్కువ శాతం బ్రాండ్లపైనే పెంచే అవకాశం ఉన్నందున వాటి అమ్మకాలు సాధారణంగానే ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా బ్రాండ్లు ధరలు పెరిగితే పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదని అంటున్నారు. తక్కువ ధర లిక్కర్ పై ధరలు పెంచడం వల్ల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ ధర కలిగిన బ్రాండ్లపైనే ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి..? ఏ ఏ బ్రాండ్లపై ధరలు పెరుగుతాయి అనేది త్వరలో నిర్ణయించబడుతుంది.
కరోనా సమయంలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత మరోసారి తక్కువ మొత్తంలో పెంచారు. అయితే ఇప్పుడు ధరలు పెరగడంతో అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందో అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వేసవి కావడంతో వీళ్ళ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని.. లిక్కర్ ధరలు పెరిగితే అమ్మకాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కానీ ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదని కంపెనీలు తెలుపుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..
Also Read : కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్ ఆరోపణలు.. ఐసీఐసీఐ క్లారిటీ!