Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక హీరో సినిమా సక్సెస్ అయితే వేరే హీరోలు కూడా తమ సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తూ ఉంటారు. ఇక పర్సనల్ గా వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికి సినిమాల పరంగా మాత్రం ఎప్పటికప్పుడు ఎవరికి వారు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క హీరో మంచి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మంచి కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కూడా పవర్ స్టార్ గా మారడమే కాకుండా ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు అయితే నచ్చుతాయో అలాంటి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
Also Read : ఇంటర్నేషనల్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ..అదృష్టం అంటే ఇదే!
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ గా కూడా ఒక భారీ రికార్డు ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా సాధించిన విజయం వల్లే ఆయన టైర్ వన్ హీరోగా మారాడు. తద్వారా నెంబర్ వన్ హీరో పొజిషన్ ని అందుకునే స్థాయికి కూడా వెళ్ళాడు. మొదట ఈ సినిమా స్టోరీని ఎస్ జె సూర్య మహేష్ బాబు తో చేయాలని అనుకున్నారట.
కానీ మహేష్ బాబు ఈ కథను రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి నెంబర్ వన్ హీరో రేసులో ముందుకు సాగాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు వదిలేసిన సినిమా వల్లే పవన్ కళ్యాణ్ టైర్ వన్ హీరోగా మారాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలను అయితే వైరల్ చేస్తున్నారు.
ఆ తర్వాత మంచి సినిమాలను చేసి ఆయన కూడా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలను చేసే స్థాయికి ఎదిగాడనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరూ కూడా బయట మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినిమాల పరంగా మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది…
Also Read : మహేష్ మూవీ పై రాజమౌళి ఇంత సైలెన్స్ మైంటైన్ చేయడానికి కారణం ఏంటి?