Prabh Simran Singh : ఎలా కొట్టాడంటే.. పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్ల పై శివతాండవం చేశాడు. ఏమాత్రం కనికరం లేకుండా బంతిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అసలు బంతితో ఏదో దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు.. మైదానంలో కోల్ కతా జట్టుపై గతంలో పగలు ఉన్నట్టుగా.. భీకరంగా బ్యాటింగ్ చేశాడు. మిగతా జట్ల ఓపెనర్లు తేలిపోతుంటే.. పంజాబ్ జట్టు తరుపున ప్రభ్ సిమ్రాన్ సింగ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 49 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో ఏకంగా 83 పరుగులు చేశాడు. తొలి 34 పరుగులను 32 బంతుల్లో చేసిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ .. ఆ తదుపరి 49 పరుగులను కేవలం 17 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. తొలి 34 పరుగులకు అతని స్ట్రైక్ రేట్ 106.25 ఉండగా… తదుపరి 49 పరుగులకు అతని స్ట్రైక్రెట్ 288.23 ఉండడం గమనార్హం. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (69) తో కలిసి తొలి వికెట్ కు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 11.5 ఓవర్లలోనే 120 పరుగుల భాగస్వామ్యం తెలపలపడం విశేషం.
Also Read : రోహిత్ అంటే అట్లుంటది మరి.. పరాయి జట్టు సభ్యుడు ఆకాశానికి ఎత్తేశాడుగా!
ఓపెనర్ అంటే నీలా ఉండాలి
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ మైదానంలో బాహుబలి లాగా రెచ్చిపోయాడు. కోల్ కతా బౌలర్లను స్టడీ చేసిన అతడు.. ఆ తర్వాత వీర విహారం మొదలుపెట్టాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఆడాడు. కనికరం లేకుండా కొట్టాడు. బంతులను మైదానం నలుమూలల పరుగులు పెట్టించాడు. కసికొద్ది బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ప్రత్యర్థి జట్ల ఓపెనర్లు తేలిపోతున్న వేళ.. ఇతడు మాత్రం పంజాబ్ జట్టు భారాన్ని ఒంటి చేత్తో మోస్తుండటం విశేషం. ప్రభ్ సిమ్రాన్ సింగ్ వల్ల పంజాబ్ జట్టు కోల్ కతా పై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఎప్పుడైతే ఓపెనర్లు అవుట్ అయ్యారో అప్పుడే అయ్యర్ లేదా ఇతర ఆటగాళ్లు రంగంలోకి దిగితే బాగుండేది. కాకపోతే అతడిని కాకుండా మాక్స్ వెల్, జాన్సన్ ను పంపించడం వల్ల పంజాబ్ జట్టు ఊహించని స్కోర్ చేయలేకపోయింది. ఒకవేళ మిగతా ప్లేయర్లు కనుక ధాటిగా ఆడి ఉండి ఉంటే.. పంజాబ్ జట్టు మరింత భారీ స్కోర్ చేసి ఉండేది. అయితే మిగితా ఆటగాళ్లు విఫలం కావడంతో.. పంజాబ్ జట్టు ఒక మాత్రం స్కోర్ వరకే ఆగిపోయింది. వారు గనక ధాటిగా ఆడి ఉండి ఉంటే కోల్ కతా ఎదుట పంజాబ్ తక్కువలో తక్కువ 250 + టార్గెట్ ఉంచేది.
THE PRABHSIMRAN SINGH SWITCH HIT FOR SIX vs NARINE pic.twitter.com/4UWCzp03YO
— Johns. (@CricCrazyJohns) April 26, 2025