Tata Punch : భారతదేశంలో SUVల క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల డిమాండ్‌ను ఇవి బాగా తగ్గించేశాయి. ప్రస్తుతం సబ్-కాంపాక్ట్ ఎస్ యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లోని ఒక చౌకైన ఎస్యూవీ మిగతా కార్లన్నింటినీ వెనక్కి నెట్టేసి నంబర్ వన్‌గా నిలిచింది. ఆ కారు మరేదో కాదు.. టాటా పంచ్. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీగా టాటా పంచ్ రికార్డు సృష్టించింది. ఈ సెగ్మెంట్‌లో బ్రెజా నుంచి నెక్సాన్ వరకు అన్నింటినీ ఇది వెనక్కి నెట్టేసింది.
Also Read : పవర్, స్టైల్, సేఫ్టీ.. మళ్లీ పెరిగిన మారుతి నంబర్ వన్ కారు ధర
మంచి విషయం ఏమిటంటే టాటా పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ మోడళ్లలో కూడా అందుబాటులో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పంచ్ తన కేటగిరీలోనే కాకుండా అన్ని కార్ల అమ్మకాల్లోనూ రెండో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,96,572 యూనిట్ల పంచ్‌ను విక్రయించింది. పంచ్ తర్వాత మారుతి సుజుకి బ్రెజా నిలిచింది. మారుతి సుజుకి 1,89,163 యూనిట్ల బ్రెజాను విక్రయించింది. బ్రెజా తర్వాత మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1,66,216 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన మరో టాటా కారు నెక్సాన్. టాటా మోటార్స్‌కు నెక్సాన్ ఒక పెద్ద విజయాన్ని అందించింది. ఈ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ రూపాల్లో అందుబాటులో ఉంది. టాటా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,63,088 యూనిట్ల నెక్సాన్‌ను విక్రయించింది. ఇక ఐదో స్థానంలో హ్యుందాయ్ వెన్యూ నిలిచింది. హ్యుందాయ్ గత ఆర్థిక సంవత్సరంలో 1,19,113 యూనిట్ల వెన్యూను విక్రయించింది.
ఈ లిస్ట్‌లో టాటా పంచ్ అత్యంత సరసమైన ఎస్ యూవీ. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.6.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఐదుగురు కూర్చోవడానికి తగినంత స్థలం ఉంటుంది. ఇంకా అనేక అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. పంచ్‌లోని ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ ఎంట్రీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రియర్ ఏసీ వెంట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన బడ్జెట్ లో దొరికే కారు కూడా.