Kamindu Mendis : చెన్నై జట్టు చేతిలో హైదరాబాదును గెలిపించిన ఘనత ముమ్మాటికి కామిందు మెండీస్ కు దక్కుతుంది. ఎందుకంటే మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్న చోట.. అతడు నిలబడ్డాడు. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు తనకు మాత్రమే సాధ్యమైన ఫీల్డింగ్ చేసి హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు చెన్నై జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అటు ఫీల్డింగ్.. ఇటు బ్యాటింగ్.. మధ్యలో బౌలింగ్.. ఇలా మూడు విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. అంతే కాదు హైదరాబాద్ జట్టుకు విజయం అనివార్యమైన దశలో.. చివరి వరకు నిలబడి గెలిపించి చూపించాడు. తద్వారా కావ్య మారన్ మోములో ఆనందాన్ని నింపాడు. హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ మీద ఆశలు కల్పించాడు. మెండిస్ అద్భుతమైన ప్రదర్శన ద్వారా పుష్కరం తర్వాత చిదంబర స్టేడియంలో చెన్నై జట్టుపై హైదరాబాద్ గెలిచింది. తద్వారా వైఫల్య రికార్డును బ్రేక్ చేసింది.
Also Read : సునీల్ గవాస్కర్ సార్.. ఈ వయసులో మైదానంలో ఇదేం పని!
ఫర్ఫెక్ట్ ఆల్ రౌండర్
ఈ మ్యాచ్లో అనితర సాధ్యమైన క్యాచ్ పట్టి అదరగొట్టాడు. చెన్నై జట్టు ఆటగాడు , విధ్వంసకరంగా ఆడుతున్న బ్రేవిస్ ను అద్భుతమైన క్యాచ్ పట్టి పేవిలియన్ పంపించాడు. తద్వారా ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యుత్తమమైన క్యాచ్ పట్టిన ఫీల్డర్ గా మెండిస్ రికార్డు సృష్టించాడు. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో హర్షల్ పటేల్ 12 వ ఓవర్ వేస్తున్నాడు. ఈ ఓవర్లో ఐదో బంతిని బ్రేవిస్ ఓ రేంజ్ లో కొట్టాడు. బంతిని బలంగా కొట్టడంతో అది సిక్సర్ దిశగా వెళ్ళింది. ఈ దశలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మెండిస్ అమాంతం గాల్లోకి ఎగిరాడు. స్పైడర్ మాన్ మాదిరిగా బంతిని పట్టుకున్నాడు.. తన లైఫ్ సైడు వైపు వస్తున్న బంతిని అతడు రెప్పపాటులో చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అమాంతం పట్టుకున్నాడు.. ఈ దశలో చెన్నై జట్టు ఒకసారిగా కుదుపునకు గురైంది. బ్రేవిస్ అవుట్ కావడంతో 114 పరుగుల వద్ద ఐదో వికెట్ ను నష్టపోయింది. ఆ తర్వాత చెన్నై 154 పరుగులకు కుప్పకూలింది. ఇక 155 పరుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. ఇక మెండిస్ జట్టుకు అవసరమైన పరుగులు చేసి విజయం వైపు నడిపించాడు. క్లాసెన్(7), అనికేత్ వర్మ (19) విఫలమైన చోట అతడు నిలబడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఆరో వికెట్ కు అజేయంగా 49 పరుగులు జోడించాడు. ముఖ్యంగా చెన్నై బౌలర్లను మెండిస్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మతిష పతిరణ బౌలింగ్లో అయితే రెచ్చిపోయాడు. దీంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఒకానొక దశలో క్లాసెన్, ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్ జట్టును మెండిస్ ఆపద్బాంధవుడిలా కాపాడాడు. బంతితోనూ మెండిస్ మెరిశాడు. ప్రమాదకరమైన రవీంద్ర జడేజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా హైదరాబాద్ జట్టుకు చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఆల్ రౌండర్ దొరికాడు . అది కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.
Also Read : ఇషాన్ కిషన్ అవుట్ కాదా? మరి ఎందుకు వెళ్లిపోయినట్టు?