Mahieka Sharma claps after Hardik Pandya Out: దక్షిణాఫ్రికా తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని రంగాలలో విఫలమైంది. తద్వారా చాలా రోజుల తర్వాత ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలో ఓటమి పొందింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు మొత్తం వరుసగా అవుట్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమౌతోంది.
టీమిండియా స్టార్ ఆటగాడు హార్థిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత.. అతడి ప్రియురాలు మహిక శర్మ నుంచి దారుణమైన అవమానం ఎదురైంది. హార్దిక్ అవుట్ అయిన తర్వాత అతడి ప్రియురాలు మహీక చప్పట్లు కొట్టింది. దీంతో మ్యాచ్ చూస్తున్నవారికి ఆ సన్నివేశం ఆశ్చర్యంగా అనిపించింది. భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ సందర్భాన్ని మరో విధంగా మహిక జరుపుకోవాల్సి ఉండేది. అలాకాకుండా ఆమె చప్పట్లు కొట్టడం వివాదాస్పదంగా మారింది..
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఆ ఫోటోలు కూడా విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. మిహికా శర్మ పై సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అవుట్ అయితే చప్పట్లు ఎలా కొడతామంటూ ఆమె తీరును విమర్శిస్తున్నారు. హార్దిక్ పాండ్యా ప్రేమికురాలిని తెచ్చుకోలేదని.. బద్ధ శత్రువును ఆహ్వానించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకోసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు మహి కాను వెంట తీసుకెళ్ళకు అని హార్దిక్ పాండ్యాకు సూచిస్తున్నారు.
హార్దిక్ ఔట్.. చప్పట్లు కొట్టిన ప్రియురాలు
హార్దిక్ ప్రేయసి మహీకాపై ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిన్న SAతో మ్యాచ్ సందర్భంగా పాండ్య 18 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అవ్వగానే స్టేడియంలో ఉన్న మహీకా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఔట్ అయితే చప్పట్లు కొట్టడమేంటని నెట్టింట… pic.twitter.com/oAcsRI7T0l
— ChotaNews App (@ChotaNewsApp) February 23, 2026