ధోని: ఒక టీసీ టీమిండియా కెప్టెన్ గా ఎలా ఎదిగాడు!

ఎంఎస్ ధోని.. టీమిండియా తలరాత మార్చిన ఓ ధీరుడు. అప్పటివరకు ప్రపంచదేశాల్లో భారత్ అంటే ఉన్న అపప్రదను తొలగించిన యోధుడు.. టీమిండియాకు గెలవడం నేర్పిన నాయకుడు.. కపిల్ దేవ్ తర్వాత భారత్ కు మూడు ఫార్మాట్లలో ప్రపంచకప్ లు అందించిన క్రికెట్ కెప్టెన్ అతడు.. అంతటి ధోని పుట్టినరోజు నేడు.. టీం ఇండియా మాజీ సారథిగా.. విజయవంతమైన భారత కెప్టెన్ గా.. ప్రపంచకప్ లను అందించిన ధోని 40వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనికి సోషల్ […]

Written By: NARESH, Updated On : July 7, 2021 1:30 pm
Follow us on

ఎంఎస్ ధోని.. టీమిండియా తలరాత మార్చిన ఓ ధీరుడు. అప్పటివరకు ప్రపంచదేశాల్లో భారత్ అంటే ఉన్న అపప్రదను తొలగించిన యోధుడు.. టీమిండియాకు గెలవడం నేర్పిన నాయకుడు.. కపిల్ దేవ్ తర్వాత భారత్ కు మూడు ఫార్మాట్లలో ప్రపంచకప్ లు అందించిన క్రికెట్ కెప్టెన్ అతడు.. అంతటి ధోని పుట్టినరోజు నేడు.. టీం ఇండియా మాజీ సారథిగా.. విజయవంతమైన భారత కెప్టెన్ గా.. ప్రపంచకప్ లను అందించిన ధోని 40వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉదయం నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల వరకు ఇతర క్రీడా ప్రముఖుల నుంచి సాధారణ అభిమానుల వరకు మహీకి ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రం చూస్తే ధోని జీవితంలో ఎన్ని కష్టాలు తన ప్రియమైన క్రికెట్ ఆడడానికి ఎన్ని త్యాగాలు చేశాడో అర్తమవుతుంది. ఒక రైల్వే టీటీగా ఉద్యోగం చేస్తూ క్రికెట్ ఆటను చంపుకోలేక ఆ ఉద్యోగాన్ని వదిలి క్రికెట్ ఆప్షన్ గా ఎంచుకున్న ధోని ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ చిత్రంలో చూశాం..

‘ఎంఎస్ ధోని’ బయోపిక్ చిత్రం తెలుగులో రిలీజ్ సందర్భంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దీనికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి వచ్చి కొన్ని గొప్ప మాటలు చెప్పాడు.. ‘మిన్ను విరిగి మీద పడ్డా కూడా చలించని ఒక గొప్ప యోధుడు మహేంద్ర సింగ్ ధోని అని.. ధోని ఒక కర్మ యోగి’ అని ఆకాశానికెత్తేశాడు.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చలించని మోడీ స్థైర్యమే అతడిని అందలం ఎక్కించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

https://twitter.com/ImRaina/status/1412480002659028995?s=20