
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్ లో ని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలతో ఆయన నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు ర్యాలీగా బయలుదేరారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి రేవంత్ గాంధీ భవన్ కు చేరుకొని ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు పీసీసీ బాధ్యతలు చేపట్టనున్నారు.