తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులు.. పదో తరగతి అర్హతతో..?

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 135 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడీ టీచర్లు, అంగన్ వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 15వ తేదీ ఈ ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : July 7, 2021 11:50 am
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 135 అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడీ టీచర్లు, అంగన్ వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎలాంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. https://mis.tgwdcw.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 135 ఖాళీలలో అంగన్‌వాడీ టీచర్లు 36, అంగన్‌వాడీ ఆయాలు 83, మినీ అంగన్‌వాడీ టీచర్లు 16 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి పాసై ఉండాలి. వివాహితురాలైన అభ్యర్థిని మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామం అయితే గ్రామ పంచాయతీ పరిధిలో పట్టణం అయితే మున్సిపాలిటీ వార్డులో నివశిస్తున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.