Asia Cup 2023 : ఈనెల ఆఖరికి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా తరఫున ఎవరిని ఎంపిక చేస్తారు అనే డిస్కషన్ కు బీసీసీఐ తెరదించింది. ఆసియా కప్ పోటీలకు భారత్ తరఫున పాల్గొననున్న 15 మంది టీమ్ మెంబర్స్ పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే ఈ లిస్టు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపోక మానరు. ఒకరకంగా ఈ టీంలో చోటు దక్కించుకున్న 15 మందిలో కొందరు లక్కీగా ఛాన్స్ కొట్టేశారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అంత లక్కీ ప్లేయర్స్ ఎవరో చూద్దామా..
తిలక్ వర్మ
మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిలో పడిన ఈ హైదరాబాదీ ఆటగాడు ఆసియా కప్ సెలెక్టర్ల దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. అరంగేట్రంలోనే అదరగొట్టే ఆట ఆడి.. సీనియర్ ప్లేయర్స్ విఫలమైన దగ్గర కూడా తన సత్తా చాటాడు. పైగా ఇతను లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడం సెలక్షన్ విషయంలో చాలా వరకు కలిసి వచ్చిన అంశం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం టీమిండియా కు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవసరం చాలా ఉంది. అవసరమైతే బౌలింగ్ కూడా చేయడం అతనికి మరొక ప్లస్ పాయింట్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే తిలక్ వర్మ కు తొలి వన్డే సిరీస్ కావడం, దేశవాళీ మ్యాచ్లలో అతని ఫిట్నెస్ అంతంత మాత్రమే ఉండడం కాస్త ఆలోచించాల్సిన విషయం.
ఇక హార్డ్ లెంగ్త్ డెలివరీలు వేస్తే ఎదుర్కోవడంలో తడబడడం స్పష్టంగా గమనించవచ్చు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మను ఏ బేసిస్పై టీం లోకి తీసుకున్నారు అనే విషయం పెద్ద మిస్టరీగా మారింది.
మహమ్మద్ షమీ
ఈ వెటరన్ పేసర్ ఐపీఎల్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన ప్రతిభ కనబరిచాడు. కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం అతను అంత గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. తను ఆడిన మొత్తం 8 వన్డేలకు కలిపి కేవలం 10 వికెట్లతో సరిపెట్టుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత అతను తిరిగి గ్రౌండ్ లో అడుగు పెట్టింది లేదు.
వరుస మ్యాచ్లలో తమ సత్తాని చాటుతున్న ప్లేయర్స్ ను పక్కన పెట్టి అనుక్యంగా ఆసియా కప్ టీం లో ఇతనికి చోటు దక్కించడం ఆశ్చర్యంగానే ఉంది. అంతేకాదు కదా రెండేళ్లుగా ఈ ఫార్మాట్లో షమీ పర్ఫామెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. అయినా లక్కీగా అతనికి ఆసియా కప్ టీంలో చాన్స్ దొరికింది.
సూర్యకుమార్ యాదవ్
వన్డే ఫార్మాట్ కు పెద్దగా సెట్ కానీ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఆడిన 26 మ్యాచులకు గాను ఈ టీ20 స్టార్ కేవలం 511 పరుగులు సాధించాడు. అంతెందుకు ఆస్ట్రేలియాలో జరిగిన సీరియస్ లో వరుసగా గోల్డెన్ డక్ రికార్డ్ సూర్య కుమార్ యాదవ్ కి దక్కుతుంది. ఈ సంవత్సరం మొత్తానికి 10 వన్డేలలో పాల్గొన్న సూర్య కేవలం 127 పరుగులతో సరిపెట్టుకున్నాడు. మరి ఇటువంటి అద్భుతమైన గణాంకాలు కలిగిన ఈ ప్లేయర్ ను ఆసియా కప్ కు సెలెక్ట్ చేశారు అంటే లక్ కాక మరేంటి.