India Vs Ireland T20: ఐర్లాండ్ లో జరుగుతున్న మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించి మంచి జోరు మీద ఉన్న టీం ఇండియా ఇంకొక ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం నాడు ఆదిత్య ఐర్లాండ్ జట్టుతో జరగనున్న ఆఖరి టీ20లో అమీ తుమీ తేల్చుకోవడానికి భారత్ ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. ఈ సిరీస్ లో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో సీరీస్ పై పట్టు సాధించిన భారత్ క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తుంది.
మరోపక్క కనీసం మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలి అని ఐర్లాండ్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే సీరియస్ భారత్ కైవసం కావడంతో రానున్న మ్యాచ్ లో ఆడబోయే టీమిండియా జట్టులో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించే దిశగా ఈ మార్పులు చేశారు.
అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాతో,ప్రసిద్ కృష్ణ, సంజూ శాంసన్ పాల్గొనే అవకాశం లేదు అని తెలుస్తుంది.బుమ్రా ఆడని పక్షంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టు యొక్క సారధ్య బాధ్యతలను నిర్వహిస్తాడు. ఇక
సంజూ శాంసన్ ప్లేస్ లో జితేశ్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఇది అతనికి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసే మొదటి మ్యాచ్ అవుతుంది.ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ కి కూడ తుది జట్టులో అడే అవకాశం ఉంది.
ఈ సిరీస్ తో సుధీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా అసాధారణ ప్రతిభ కనబరిచి తను ఇంకా ఫామ్ లోనే ఉన్నాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.ప్రసిధ్ కృష్ణ కూడ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయితే జరగనున్న ఆసియా కప్ నేపథ్యంలో ఈ ఇద్దరి ప్లేయర్స్ కి ఇంకా ప్రాక్టీస్ అవసరం అని మేనేజ్మెంట్ భావిస్తే వీళ్లు ఈ మ్యాచ్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. లేకపోతే ఈ మ్యాచ్ కి వీళ్ళకు రెస్ట్ దొరుకుతుంది.
మరోపక్క వెస్టిండీస్ లో తన సత్తా చాటున తిలక్ వర్మ వరుసగా రెండు టీ20 మ్యాచ్ లలో విఫలమయ్యాడు. అయినప్పటికీ అతనికి ఆసియా కప్ ఆడబోయే జట్టులో స్థానం దక్కింది. ఇక ఎప్పుడైనా జరగబోయే మూడవ
మూడో టీ20లో అతను తన బ్యాట్ ఝులిపించి తన సత్తా నిరూపించుకోవాల్సిందే.వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో
షెహ్‌బాజ్ అహ్మద్‌కు ఆడే ఛాన్స్ ఉంది,ఇక రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే టీం లో కొనసాగనున్నారు.
3వ టీ 20 పాల్గొనబోయే భారత తుది జట్టు అంచనా..
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్.