Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన పవన్.. కారణం అదే

Pawan Kalyan: రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన పవన్.. కారణం అదే

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజి సినిమా షూటింగ్ కొద్ది రోజుల కిందట ముంబాయిలో ప్రారంభమైంది. ఇప్పటికే యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూల్ ను పూర్తి చేసింది. సుమారు 60 శాతం మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.

Pawan Kalyan: పవన్ రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. మొన్నటి వరకు వారాహి యాత్ర తో బిజీగా గడిపారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి.. పూర్తిస్థాయి పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.సెప్టెంబర్, అక్టోబర్లో సినిమాలను పూర్తి చేసి నవంబరు నుంచి ఎన్నికల గోదాలోకి దిగనున్నారు.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజి సినిమా షూటింగ్ కొద్ది రోజుల కిందట ముంబాయిలో ప్రారంభమైంది. ఇప్పటికే యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూల్ ను పూర్తి చేసింది. సుమారు 60 శాతం మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నటి ప్రియాక అరుల్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది.

ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ లో 20 రోజులు, నవంబర్లో ఎనిమిది రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 20 రోజులు పాటు షూటింగ్ బ్యాంకాక్ లో ఉంటుందని.. వాటికి సంబంధించి స్పాట్లను గుర్తించే పనిలో యూనిట్ ఉంది. అక్టోబర్, నవంబర్ లో పవన్ సినిమా షూటింగుల్లో పాల్గొంటారు. దీంతో రాజకీయ కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంది.

నవంబర్ మూడో వారం నుంచి పవన్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతారని సమాచారం. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అటు పొత్తుల వ్యూహాలు, ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉండడంతో.. సినిమాలకు బ్రేకప్ ఇస్తారని సమాచారం. దాదాపు మే, జూన్ వరకు పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ పై ఉన్న క్రేజ్ దృష్ట్యా కీలక ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాతలు సైతం.. ఆయన కోసం వేచి చూసేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper