LSG Vs CSK IPL 2025: క్రికెట్లో ధోని అద్భుతంగా కీపింగ్ చేస్తాడు. అందుకే కీపింగ్ లో టీమిండియా సాధించిన రికార్డులు ధోనికి ముందు.. ధోని కి తర్వాత అని విభజించవచ్చంటే.. టీమిండియాలో ధోని మార్క్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే ధోని టీమిండియాలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ లో చెన్నై జట్టుతో కూడా అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అందువల్లే చెన్నై జట్టు ధోని కి 43 సంవత్సరాల వయసుకు వచ్చినప్పటికీ వదిలిపెట్టకుండా ఉంటున్నది. ధోని కూడా చెన్నై జట్టుపై అంతే మమకారాన్ని చూపిస్తుంటాడు. అయితే ధోనికి కొంతమంది బౌలర్లతో మంచి బాండింగ్ ఉంది. అందువల్లే వారి బౌలింగ్లో వేగంగా స్టంప్ అవుట్ లు చేస్తుంటాడు. అలాగని మిగతా బౌలర్లతో దోనికి కనెక్టింగ్ లేదా అంటే.. ఉంది. కాకపోతే ధోనికి ఈ బౌలర్లకు మాత్రం అత్యంత బలమైన కనెక్టివిటీ ఉంది. అందువల్లే ఆ బౌలర్లు వికెట్లు తీయగలుగుతున్నారు. ధోని స్టంట్ అవుట్ లు చేయగలుగుతున్నాడు.
Also Read: చెన్నై కి కొత్త ఊపిరి పోసిన ఆ ఒక్క ఓవర్
ఐపీఎల్ చరిత్రలో..
ఐపీఎల్ చరిత్రలో బౌలర్ – వికెట్ కీపర్ విభాగంలో మొదటి స్థానంలో అమిత్ మిశ్రా – దినేష్ కార్తీక్ కొనసాగుతున్నారు. వీరిద్దరూ కలిసి 9 స్టంప్ అవుట్లు చేశారు. దినేష్ కార్తీక్ చెప్పిన విధంగా మిశ్రా బౌలింగ్ వేస్తాడు. అందువల్లే బ్యాటర్లు అయోమయానికి గురై స్టంప్ అవుట్ గా వెనక్కి వెళ్తుంటారు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా, గిల్ క్రిస్ట్ ఉన్నారు. వీరిద్దరు కూడా 9 స్టంప్ అవుట్ లలో పాలుపంచుకున్నారు. ఇక మూడో స్థానంలో రవీంద్ర జడేజా – మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. వీరిద్దరు కూడా తొమ్మిది స్టంపు అవుట్లలో పాలుపంచుకున్నారు. అంతేకాదు వీరిద్దరికి మైదానం వెలుపల కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అందువల్లే రవీంద్ర జడేజా సుదీర్ఘకాలంగా చెన్నై జట్టుతో కొనసాగుతున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ – మహేంద్ర సింగ్ ధోని 8 స్టప్ అవుట్లలో పాలుపంచుకున్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. రవిచంద్ర అశ్విన్, ధోనిమధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిస్తే కాలమే తెలియనంతగా సంభాషణలు జరుపుకుంటారు. టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోని రవిచంద్రన్ అశ్విన్ కు టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ లో విపరీతంగా అవకాశాలు ఇచ్చాడు. అందువల్లే అశ్విన్ మేటి బౌలర్ గా ఆవిర్భవించాడు. అయితే ఇప్పటికీ అశ్విన్ – ధోనిమధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్లో ధోని నాయకత్వంలో అశ్విన్ ఆడుతున్నాడు. ధోని సిఫారసు వల్లే అశ్విన్ ను చెన్నై జట్టు కొనుగోలు చేసిందనే వాదనలు లేకపోలేదు.
Also Read: ఎన్నో రోజులకు ఫినిషర్ ధోనీ మళ్ళీ మెరిశాడు… ఇదే కంటిన్యూ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే!