LSG Vs CSK 2025: దూకుడుగా ఆడుతూ.. రక్షణాత్మక ధోరణి విస్మరిస్తే.. బీభత్సంగా ఆడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే.. జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. చెన్నై తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ కు ఇది అనుభవంలోకి వచ్చింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు దూకుడుగా ఆ డుతూ.. లక్నో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్న నికోలస్ పూరన్.. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం పప్పులో కాలేశాడు. ఎంతో విధ్వంసమైన ఆట తీరు ప్రదర్శించే నికోలస్ పూరన్ తప్పుడు అంచనా తో పుట్టి ముంచుకున్నాడు. ఫలితంగా లక్నో జట్టు స్కోర్ ఒక్కసారిగా పడిపోయింది. అంతేకాదు చెన్నై జట్టు తొలిసారిగా పై చేయి సాధించింది.. అయితే నికోలస్ పూరన్ అవుట్ వెనక తన మాస్టర్ బ్రెయిన్ ను ధోని ప్రదర్శించాడు. అంతిమంగా చెన్నై జట్టుకు తిరుగులేని లీడ్ సాధించాడు.
Also Read: గురుశిష్యుల ప్రేమ.. ధోని-పంత్ కామెడీ టైమింగ్ అదుర్స్
ఏం జరిగిందంటే..
ఆరు పరుగులు చేసిన మార్క్రం ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సహాయంతో 8 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఇతడిని అవుట్ చేసేందుకు ధోని అన్షుల్ కాంబోజ్ ను రంగంలోకి దింపాడు. అంతే వెంటనే ఫలితం వచ్చేసింది. నాలుగో ఓవర్ చివరి బంతి నికోలస్ పూరన్ ప్యాడ్లను తగిలింది. ఫీల్డ్ ఎంపైర్ కు అప్పీల్ చేయగా నాట్ అవుట్ ఇచ్చాడు. దీంతో నీ వెంటనే రివ్యూ కి వెళ్ళాడు. రివ్యూలో బంతి ప్యాడ్లను తగిలినట్టు స్పష్టంగా కనిపించింది. అది మిడ్ వికెట్ ను పడగొట్టడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో ఎనిమిది పరుగులు చేసిన నికోలస్ పూరన్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.నికోలస్ పూరన్ వికెట్ పడిన తర్వాత లక్నో జట్టు స్కోర్ నెమ్మదించింది.. పంత్ (63), మార్ష్(30) పరుగులు చేయడంతో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్లలో దారుణంగా విఫలమైన పంత్.. ఈ మ్యాచ్లో మాత్రం టచ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా చెన్నై బౌలర్ల పై తన ప్రతీకారాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడు తొలిసారిగా ఈ ఐపీఎల్ సీజన్లో హాఫ్ సెంచరీ చేశాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్లో పంత్ పై లక్నో యాజమాన్యానికి పెద్దగా ఆశలు లేవు. అయితే వరుసగా విఫలమవుతున్న అతడు.. ఈ మ్యాచ్లో మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. గట్టిగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాడు.. చివరికి లక్నో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
Also Read: పూజార, హనుమ విహారి.. అప్డేట్ అవ్వండి.. రహానే, కరుణ్ ను చూసి నేర్చుకోండి! .