Prashanth Neel : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)… కే జి ఎఫ్ (KGF) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడి అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక కేజీఎఫ్ తర్వాత సలార్ (Salaar) సినిమాతో ప్రభాస్ కి భారీ విజయాన్ని అందించిన ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్న ప్రశాంత్ నీల్ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటున్న ఆయన కే జి ఎఫ్ 3 (KGF 3) సినిమాకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేసినట్లుగా తెలుస్తుంది… కెజిఎఫ్ 3 సినిమాలో ఒక స్టార్ హీరోతో చేయాలని అనుకుంటున్నారట. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ (Ram Charan) కేజిఎఫ్ 3 లో రాఖీ భాయ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి యష్(Yash) పోషించిన పాత్రలో రామ్ చరణ్ నటిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా? ఎలాగైతే తన హీరోయిజాన్ని చూపిస్తూ సక్సెస్ ను కట్టబెట్టాడో రామ్ చరణ్ కూడా అలాంటి విజయాన్ని సాధించి పెడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ కూడా ఒకడు.
Also Read : ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…
మరి ఇలాంటి ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటూ ఇప్పటికే మెగా ఫాన్స్ సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
Also Read : ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి ఫెయిల్ అయ్యాడు..ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడు..?