ILP 2025 : అదే ఒక గురువు తన దగ్గర ఓనమాలు నేర్చి.. తన ముందు ఎదిగి.. చివరికి తనతో పోటీ పడితే ఆ గురువు ఆనందానికి అవధులు ఉండదు. ఆనందాన్ని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనుభవిస్తున్నాడు. ఐపీఎల్ లో భాగంగా చెన్నై జట్టు లక్నోతో తలపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు కూడా టాప్ -4 లో ఉంది. గత సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన పంత్..ఈసారి లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ ఆటగాడిగా పేరుపొందాడు. గత సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించినప్పుడు చెన్నైతో పోటీ పడినప్పటికీ.. అప్పుడు చెన్నై జట్టు కెప్టెన్ గా రుతు రాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఇప్పుడు రుతురాజ్ గాయం కావడంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. ధోని ఆధ్వర్యంలో ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. అంతేకాదు పాయింట్లు పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. దీంతో సోమవారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ కథనం రాసే సమయం వరకు లక్నో జట్టు 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 121 పరుగులు చేసింది. సమద్(11), రిషబ్ పంత్ (40) క్రీజ్ లో ఉన్నారు. రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.
Also Read : పూజార, హనుమ విహారి.. అప్డేట్ అవ్వండి.. రహానే కరుణ్ ను చూసి నేర్చుకోండి! .
మైదానంలో సరదాగా..
ఈ మ్యాచ్ జరుగుతున్న లక్నోలోని ఎకానా మైదానంలో గురు శిష్యులు రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోని సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా.. స్నేహితుల మాదిరిగా వ్యవహరించారు. ధోని సారధ్యంలో రిషబ్ పంత్ అనేక పాఠాలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా వికెట్ కీపింగ్ వేగంగా చేయడాన్ని ధోని వద్ద నుంచి పంత్ గ్రహించాడు. అందువల్లే పంత్ వేగంగా కీపింగ్ చేయగలుగుతున్నాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంతోమంది గొప్ప గొప్ప కీపర్లు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదని రోహిత్ శర్మ రిషబ్ పంత్ వైపు మొగ్గు చూపించాడు. ఎందుకంటే ధోని సారథ్యంలో రిషబ్ రాటు తేలాడు. అందువల్లే అతనితో ఫలితాలు సాధించవచ్చు అని రోహిత్ శర్మ రిషబ్ పంత్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక ఇన్నాళ్లకు గురుశిష్యులు పరస్పరం తలపడటంతో ఎకానా మైదానంలో సందడి నెలకొంది. ముఖ్యంగా ధోని టాస్ గెలిచిన తర్వాత.. మైదానంలో అల్లరి తారస్థాయికి చేరింది. చివరికి ధోని బౌలింగ్ ఎంచుకోవడంతో.. లక్నో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే బౌలర్లకు అనుకూలంగా మారిన ఈ పిచ్ పై బ్యాటర్లు పరుగులు తీయలేకపోతున్నారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Can you guess the joke here?
We are getting started in Lucknow with a ”
Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @LucknowIPL | @ChennaiIPL pic.twitter.com/a9CGMOSOUg
— IndianPremierLeague (@IPL) April 14, 2025