Champions Trophy : ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న క్రీడా ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అనే చెప్పాలి…క్రికెట్ లో ముఖ్యంగా బ్యాట్స్ మెన్స్ కి ఎక్కువ గుర్తింపు ఉంటుంది…ఇక ప్రస్తుతం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో బ్యాట్ తో బీభత్సం సృష్టించడానికి కొంతమంది స్టార్ బ్యాట్స్ మెన్స్ సిద్దమవుతున్నారు… ఇంతకీ ఆ స్టార్ బ్యాట్స్ మెన్స్ ఎవరు వాళ్ళు ఈ ట్రోఫీ లో పరుగుల వరద పారించబోతున్నారా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
రోహిత్ శర్మ
ఇండియన్ టీమ్ కెప్టెన్ గా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న రోహిత్ శర్మ గత కొద్ది రోజుల నుంచి పెద్దగదాం లో లేడు. కానీ ఇంగ్లాండ్ లో జరిగిన కటక్ వన్డే మ్యాచ్ లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్ల మీద విరుచుకుపడుతూ భారీ సిక్సర్లతో స్టేడియం మొత్తం దుమ్ములేపాడు…ఇక 90 బంతుల్లో 119 పరుగులు చేసిన ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఫామ్ లోకి రావడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి…ఇక రోహిత్ శర్మ విధ్వంసానికి ఎంత మంది బౌలర్లు బలి అవుతారో చూడాలి…
శుభ్ మాన్ గిల్
ఇండియన్ టీమ్ కి దొరికిన మరో ఆణిముత్యం గిల్…ఆయన విధ్వంసం ముందు ఏ బౌలర్ నిలువలేడనే చెప్పాలి…ఆయన లాంటి బ్యాట్స్మెన్ తాకిడిని తట్టుకోవడం ఎవ్వరూ వాళ్ల కావడం లేదు…ఇక రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి తను ఎప్పుడైనా కూడా మంచి ఫామ్ లో ఉంటానని ప్రూవ్ చేశాడు…కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ లో గిల్ కూడా చాలా కీలకంగా మారబోతున్నాడు అనేది చాలా స్పష్టం గా తెలుస్తోంది…
స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా టీమ్ లో ఉన్న అత్యంత డేంజరస్ బ్యాట్స్ మెన్స్ లో స్టీవ్ స్మిత్ ఒకరు…ఆయన లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఓడిపోతే మ్యాచ్ లను సైతం గెలిపిస్తూ ఉంటాడు…ముఖ్యంగా ఆస్ట్రేలియా మిడిలార్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం కూడా ఆయన బ్యాటింగ్ వల్లే అనే క్లారిటీ కూడా ఉంది ఇక ఏది ఏమైనా కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో రెండు సెంచరీలు చేసి 314 పరుగులు చేశాడు…ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆయన తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నారు…
ఫఖర్ జమాన్
పాకిస్థాన్ ఓపెనర్ ప్లేయర్ అయిన ఫఖర్ జమాన్ కూడా చాలా డేంజరస్ ప్లేయర్ అనే చెప్పాలి…ఆయన తలుచుకుంటే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పే కెపాసిటి ఉన్న ప్లేయర్ కావడం విశేషం…ఇక ఇలాంటి ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఎలాంటి బీభత్సం సృష్టించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 69 మ్యాచ్ లో 84 పరుగులు చేశాడు పాకిస్థాన్ ను ఆదుకునే ప్రయత్నం అయితే చేశాడు…ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయిన కూడా ఆయన పోరాటం చాలా గొప్ప గుర్తింపును తెచ్చుకుంది…
ట్రావిస్ హెడ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అందరికంటే విద్వంసం సృష్టించగలిగే బ్యాట్స్ మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ట్రావిస్ హెడ్ అనే చెప్పాలి…ఇప్పటివరకు ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ కి న్యాయం చేస్తూ ఉంటాడు…ఇండియా తో జరిగిన 5 మ్యాచుల్లో 448 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం…
ఇక ఈ ఐదుగురు బ్యాట్స్ మెన్స్ ను బౌలర్లు ఎలా ఎదురుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…