TDP And Janasena: రాజకీయ పార్టీల్లో( political parties) అనుబంధ విభాగాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా పార్టీలో సోషల్ మీడియానే ఫైనల్. దాదాపు అన్ని పార్టీలది అదే పరిస్థితి. ప్రతి పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతూ వస్తోంది. అధికారపక్షమైతే ప్రతిపక్షాలపై.. విపక్షాలైతే అధికార పార్టీపై బురద చల్లుకోవడం, వ్యతిరేక ప్రచారం చేసుకోవడం చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. అయితే ఇప్పటివరకు అధికార పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవి. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం మాత్రం చాలా దూకుడుగా ఉంది. ముఖ్యంగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ఉంది.
* కిరణ్ రాయల్ ఎపిసోడ్ వెనుక
ఇటీవల తిరుపతికి( Tirupati) చెందిన జనసేన నేత కిరణ్ రాయల్( Kiran Royal ) ఎపిసోడ్ నడిచింది. తనను కిరణ్ రాయల్ నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏకంగా సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అంతటితో ఆగకుండా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. తన వద్ద కోటి 25 లక్షల రూపాయల నగదుతో పాటు 25 సవర్ల బంగారం తీసుకొని కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో రోజుకో వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది. దీని వెనుక వైసిపి సోషల్ మీడియా హస్తము ఉందన్నది కిరణ్ రాయల్ చేసిన ఆరోపణ. కానీ దీనిని ఎదుర్కోవడానికి జనసేన సోషల్ మీడియా ముందుకు రాలేదు. అటు టిడిపి సోషల్ మీడియా సైతం మౌనంగా ఉండిపోయింది.
* వైసీపీ సోషల్ మీడియా దూకుడు
వాస్తవానికి వైసీపీ( YSR Congress ) సోషల్ మీడియా విభాగం చాలా దూకుడుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసిన మరుక్షణం రంగంలోకి దిగుతుంది. ఎంతటి వారైనా వ్యతిరేక ప్రచారం ప్రారంభమవుతుంది. చివరకు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డిని సైతం వైసీపీ సోషల్ మీడియా విడిచిపెట్టలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ బలం కూడా సోషల్ మీడియా విభాగమే. అయితే ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడంతో సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని కూడా వచ్చారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఆ రెండు పార్టీల లోపాలను బయటపెట్టే పని చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.
* ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు
అయితే ప్రభుత్వ వైఫల్యాలను( government failures ) ఎండగట్టడం.. కూటమిపై విమర్శలు వచ్చే క్రమంలో తిప్పి కొట్టడం వంటివి టిడిపి తో పాటు జనసేన సోషల్ మీడియా చేయాలి. కానీ ఎందుకో ఆ రెండు విభాగాలు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదన్న విమర్శ ఉంది. టిడిపి అనుకూల మీడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక అనేక రకాల అనుమానాలను సైతం వ్యక్తం చేస్తోంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. సోషల్ మీడియా విభాగాలను నడిపించడంలో కూటమి పార్టీలు విఫలమవుతున్నాయని కూడా అభిప్రాయపడింది. అయితే టిడిపి అనుకూల మీడియా సైతం ఏమంత తక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కనిపించినా కనిపించక పోయినా అదేపనిగా ప్రచారం చేయడంలో దిట్ట. జనసేన సోషల్ మీడియా సైతం చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆ దూకుడు చాలదు అన్నట్టు ఉంది టిడిపి అనుకూల మీడియాకు. అందుకే రెచ్చగొట్టే పనిలో పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలు రెచ్చిపోతాయో? లేదో?!..
ప్రతీసారి మన వెంకటకృష్ణ మన సోషల్ మీడియా ని భలే పొగుడుతాడు అబ్బా…. ♂️ pic.twitter.com/VgLuUenZ1O
— (@Gjkiran20) February 11, 2025