KKR Vs PBKS IPL 2024: కోల్ కతాకు చెలగాటం.. పంజాబ్ కు ప్రాణసంకటం.. నేటి ఐపీఎల్ మ్యాచ్ ఆసక్తికరం

పంజాబ్ జట్టు ఈ టోర్నీలో అత్యంత నిరాశజనకమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ లలో కెప్టెన్ ధవన్ జట్టుకు దూరమయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 26, 2024 10:24 am

KKR Vs PBKS IPL 2024

Follow us on

KKR Vs PBKS IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్లో మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. అయ్యర్ నేతృత్వంలోని ఆ జట్టు ప్రస్తుతం ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడి, ఐదు విజయాలు సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సొంతమైదానంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ జట్టు పై విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగాలని కోల్ కతా భావిస్తోంది. కోల్ కతా జట్టులో మిచెల్ స్టార్క్ స్థానంలో శ్రీలంక ఆటగాడు చమీర ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పంజాబ్ జట్టు ఈ టోర్నీలో అత్యంత నిరాశజనకమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ లలో కెప్టెన్ ధవన్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సామ్ కరణ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయినప్పటికీ పంజాబ్ జట్టు రాత మారలేదు. దీంతో శుక్రవారం కోల్ కతా జట్టు తో జరిగే మ్యాచ్ లో ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు పంజాబ్ జట్టు 8 మ్యాచులు ఆడి, కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ను పంజాబ్ జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది. కోల్ కతా తో జరిగే మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో విజయం సాధించాలని పంజాబ్ జట్టు భావిస్తోంది.

కోల్ కతా జట్టు లో సాల్ట్, నరైన్, శ్రేయస్ అయ్యర్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. కీలక బ్యాటర్లుగా ఉన్న రింకు సింగ్, రుథర్ఫర్డ్, నితీష్ రానా నుంచి ఆ జట్టు భారీ ఇన్నింగ్స్ అంచనా వేస్తోంది. రఘువన్షీ టచ్ లోకి రావాలని భావిస్తోంది. బౌలింగ్ విభాగం లోను సునీల్ నరైన్ అదరగొడుతున్నాడు. రస్సెల్, వెంకటేష్ అయ్యర్, రమన్ దీప్ సింగ్ సత్తా చాటితే కోల్ కతా జట్టుకు తిరుగు ఉండదు. ఈ మ్యాచ్ లో స్టార్క్ ను దూరం పెట్టి.. అతడి స్థానంలో చమీరకు అవకాశం ఇచ్చింది కోల్ కతా జట్టు.

పంజాబ్లో శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అషుతోష్ శర్మ వంటి వారు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో పెద్దగా రాణించడం లేదు. ధావన్ జట్టులోకి తిరిగి రావడం లాభించే అంశమే అయినప్పటికీ.. అతడు గత మ్యాచ్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మొత్తానికి కీలక ఆటగాళ్లు టచ్ లోకి రావాలని జట్టు భావిస్తోంది. బౌలింగ్ భారాన్ని రబాడ ఒక్కడే మోస్తున్నాడు. అతడికి మిగతా వాళ్లు తోడైతే పంజాబ్ జట్టుకు తిరుగుండదు.

ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలపడ్డాయి.. 21 విజయాలతో కోల్ కతా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పంజాబ్ 11 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం కోల్ కతా జట్టుకు గెలిచే అవకాశాలు 56%,‌పంజాబ్ జట్టుకు 44 శాతం విజయావకాశాలున్నాయి.

జట్ల అంచనా ఇలా

కోల్ కతా

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) సునీల్ నరైన్, రూథర్ఫర్డ్, నితీష్ రానా, రింకు సింగ్, రఘు వన్శీ, సాల్ట్, రస్సెల్, అనుకూల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, రమన్ దీప్ సింగ్, చమీర.

పంజాబ్

శిఖర్ ధావన్ (కెప్టెన్), సామ్ కరణ్, రొసౌ, లివింగ్ స్టోన్, అశుతోశ్ శర్మ, జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, సికిందర్ రాజా, శశాంక్ సింగ్, రబాడా, రాహుల్ చాహర్.