https://oktelugu.com/

Hyper Aadi: హైపర్ ఆదికి పెళ్లి అయ్యిందా?… ఆ షో వేదికగా భార్య ఫోటో రివీల్ చేశారుగా!

ఆది దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆది సింగల్ అని అంతా అనుకుంటున్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను అంటూ బాంబు పేల్చాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 26, 2024 / 10:22 AM IST

    Is Hyper Aadi married

    Follow us on

    Hyper Aadi: హైపర్ ఆది బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నాడు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆది ప్రస్తుతం ఈటీవీలో పలు షోలు చేస్తూ అలరిస్తున్నాడు. ఆదికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరుగులు పెట్టిస్తున్నాడు. కాగా హైపర్ ఆదికి పెళ్లి కాలేదన్న విషయం తెలిసిందే. ఏజ్ బార్ అవుతున్నా… వివాహం చేసుకోకుండా సింగల్ గా ఉంటున్నాడు.

    అనూహ్యంగా ఆది దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆది సింగల్ అని అంతా అనుకుంటున్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను అంటూ బాంబు పేల్చాడు. తన భార్యను ఏకంగా స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం కూడా చేసాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి తన భార్య ని తీసుకొచ్చాడు. తనకు పెళ్లి అయింది అంటూ చెప్పుకొచ్చాడు.

    ఎప్పటిలాగా కాకుండా ఈమె నా నిజమైన భార్య అని అంటూ షాక్ ఇచ్చాడు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాను అని తెలిపాడు. అంతేకాదు మీ అందరికీ పరిచయం చేయాలని నా భార్యను ఇక్కడికి తీసుకువచ్చాను అని అన్నాడు. ఇంతలో యాంకర్ రష్మీ ఆది భార్యని స్టేజ్ పైకి పిలిచింది. మాస్క్ ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకుని, గ్రీన్ కలర్ శారీలో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది ఆమె. అయితే ఆమె ఇండియన్ కాదని చూస్తుంటే అర్థమవుతుంది.

    ఫారెన్ అమ్మాయిని తీసుకొచ్చి స్కిట్ లో భాగంగా ఇలా చేయించారు. అనంతరం ఆది మాట్లాడుతూ .. అందమైన నా భార్య మొహాన్ని ఇంతవరకు నేనే కూడా చూడలేదని .. ఆమె భర్త మాట కంటే మేనేజర్ మాటే ఎక్కువగా వింటుందని చెప్పాడు. నేను పిలిచినా రాదని .. మేనేజర్ వెళ్ళమంటే కచ్చితంగా వెళ్తుందంటూ ఆమె పై పంచులు వేశాడు. కాగా ఇదంతా కేవలం షోలో కామెడీ పండించడం కోసం ఆది చేసిన ప్రయత్నం. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటివి చేశాడు. ఆది ఎవరినీ వివాహం చేసుకోలేదు.