Homeక్రీడలుOdi World Cup 2023: అటు కేఎల్ రాహుల్ సహకారం.. ఇటు ఎంపైర్ మమకారం.. కోహ్లీ...

Odi World Cup 2023: అటు కేఎల్ రాహుల్ సహకారం.. ఇటు ఎంపైర్ మమకారం.. కోహ్లీ సెంచరీ.. ఎంపైర్ ఆ వైడ్ ఎందుకివ్వలేదు

Odi World Cup 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ చేశాడు. ఇందుకు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌.రాహుల్‌తనవంతు సాయం అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్‌తోపాటుగా ఫీల్డ్‌ అంపైర్‌ సైతం విరాట్‌ శతకానికి తనవంతు సాయం చేశాడు. బంగ్లా బౌలర్‌ లెగ్‌సైడ్‌ వైడ్‌ వేసిన బంతిని ఫీల్డ్‌ అంపైర్‌గా ఉన్న రిచర్డ్‌ వైడ్‌గా ప్రకటించలేదు.

ఆసక్తికర ఘటనలు..
వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఛేజ్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తూ 48వ వన్డే శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఛేజింగ్‌లో 4 ఏళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్‌ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ సెంచరీకి దోహదపడ్డాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌. అయితే రాహుల్‌ తో పాటుగా ఫీల్డ్‌ అంపైర్‌ సైతం విరాట్‌ శతకానికి తనవంతు సాయం చేశాడు. ఇండియా విజయానికి రెండు పరుగులు, కోహ్లీ సెంచరీకి మూడు పరుగులు అవసరం కాగా.. అదే సమయంలో బంగ్లా బౌలర్‌ లెగ్‌సైడ్‌ వైడ్‌ వేశాడు. కానీ ఈ బంతిని ఫీల్డ్‌ అంపైర్‌గా ఉన్న రిచర్డ్‌ వైడ్‌గా ప్రకటించలేదు.

వైడ్‌ ఎందుకు ఇవ్వలేదంటే..
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది అంపైర్‌ వైడ్‌ టాపిక్‌. ఈ వైడ్‌కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. విరాట్‌ కోహ్లీ 74 రన్స్‌తో క్రీజ్‌ లో ఉన్నప్పుడు టీమిండియా విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. అయితే ఆ తర్వాత రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడి కోహ్లీ సెంచరీకిసాయం చేశాడు. ఇదిలా ఉండగా.. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 97 పరుగులతో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులు కావాలి. ఈ క్రమంలో42వ ఓవర్‌ వేయడానికి వచ్చాడు నాసుమ్‌ అహ్మద్‌. తొలి బంతిని లెగ్‌సైడ్‌ వేయగా అది కాస్త వైడ్‌గా వెళ్లింది. దీంతో అంపైర్‌ వైడ్‌ ఇస్తాడా? అన్నట్లుగా కోహ్లీ రియాక్షన్‌ ఇచ్చాడు. కానీ విరాట్‌ కొద్దిగా లోపలికి జరిగాడని భావించిన ఫీల్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌ దానిని వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో అభిమానులతోపాటు పెవిలియన్‌లో ఉన్న కుల్దీప్‌యాదవ్‌ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఊరట చెందారు. ఆ తర్వాత మూడో బంతికే సిక్సర్‌ బాదిన విరాట్‌ మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వైడ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి. అంపైర్‌ రిచర్డ్‌ సైతం ట్రెండింగ్‌లోకి వచ్చాడు. దీంతో విరాట్‌ ఫ్యాన్స్, నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌తోపాటుగా విరాట్‌ సెంచరీలో భాగం అంపైర్‌కు కూడా ఇవ్వాలని సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే విరాట్‌ సెంచరీ కోసమే అతడు వైడ్‌ ఇవ్వలేదేమో అని మరికొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. విరాట్‌ కొద్దిగా ముందుకు జరిగినందుకే అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదని ఇంకొంతమంది క్రికెట్‌ అభిమానులు చేసిన కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version