https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఓటింగ్లో తిరుగులేని రైతు బిడ్డ.. అమర్,గౌతమ్ లకు షాక్, డేంజర్లో ఆ ఇద్దరు!

ఓటింగ్ సరళి షాక్ కి గురి చేస్తుంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి భారీ ఆదరణ దక్కుతున్నట్లు ఓటింగ్ లెక్కలు చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ కి పాల్పడుతున్నారు.

Written By: , Updated On : October 20, 2023 / 01:40 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: మరో వీకెండ్ దగ్గర పడింది. అంటే ఓ హౌస్ మేట్ ఇంటిని వీడాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఈ వారానికి గాను ఏడుగురు నామినేట్ అయ్యారు. మెజారిటీ కంటెస్టెంట్స్ భోలే షావలి, అశ్వినిలను నామినేట్ చేశారు. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అమర్ దీప్, గౌతమ్, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. మంగళవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారంతో ముగియనున్నాయి.

ఇక ఓటింగ్ సరళి షాక్ కి గురి చేస్తుంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి భారీ ఆదరణ దక్కుతున్నట్లు ఓటింగ్ లెక్కలు చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ కి పాల్పడుతున్నారు. పల్లవి ప్రశాంత్ గేమ్ సరిగా లేదని అంటున్నారు. ఇంటి సభ్యుల్లో కూడా కొందరు అతడు సింపథీతో నెట్టుకొస్తున్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవేమీ జనాల్లో అతని క్రేజ్ తగ్గించలేకపోతున్నాయి. అందుకు ఓటింగ్ నిదర్శనం.

దాదాపు రెండు వారాల అనంతరం పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లోకి వచ్చాడు. తాజా లెక్కల ప్రకారం అతడికి 40 శాతం ఓట్లు దక్కాయి. తర్వాత అమర్ దీప్ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ తో పోల్చుకుంటే అమర్ దీప్, గౌతమ్ కృష్ణలను టాప్ సెలెబ్స్. కానీ రైతుబిడ్డకు వాళ్లు పోటీ ఇవ్వలేకపోతున్నారు. మూడో స్థానంలో తేజా ఉన్నట్లు సమాచారం. మొన్నటి వరకు తేజా ఐదో స్థానంలో ఉన్నాడు. భోలే, గౌతమ్ లను దాటుకొని ముందుకు వెళ్ళాడట.

ఇక నాలుగో స్థానంలో గౌతమ్, ఐదో స్థానంలో భోలే ఉన్నారట. మొదట్లో అతడు మూడో స్థానంలో కొనసాగడం విశేషం. ఆరో స్థానంలో అశ్విని, ఏడో స్థానంలో పూజా మూర్తి ఉన్నారట. వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్న క్రమంలో వీరిలో ఒకరు ఇంటికి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే వరుసగా ఏడో లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడినట్లు అవుతుంది.