Viral Photo : రాజకీయాల్లోకి రావాలని అందరూ అనుకుంటారు. యుద్ధంలో గెలవడం.. రాజకీయాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదు.. ఈ రంగంలోకి ఎందరో వచ్చారు. కానీ కొందరు మాత్రమే అత్యున్నత స్థాయికి వెళ్లారు. ఆ స్టేజీకి వెళ్లాలంటే ఆషామాషీ కాదు. ఎన్నో ఆటుపోట్లు దాటాలి.. ఎందరినో మెప్పించాలి.. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఎదురొడ్డి నిలబడాలి.. అప్పుడు లక్ష్యాన్ని చేరలగలరు. అలాంటి రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో కొందరు ప్రత్యేకంగా నిలిచారు. అనుకున్నది సాధించడం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వారిలో ఓ లీడర్ అనుకున్నది సాధించడమే కాకుండా సుపరిపాలన అందిస్తున్నాడు. ఆ లీడర్ కు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా లీడర్ అనే సందేహం కలుగుతుందా?
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ పేరు చెబితే ముందుగా వినిపించేంది ఆ పేరే.. అదే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. కేసీఆర్ గా ఎంతో పాపులర్ అయిన ఈ మాస్ లీడర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అయ్యాడు.ఎన్నో పోరాటాల మధ్య తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అంటారు ఆయన సన్నిహితులు. రాజకీయాల్లోనే కాకుండా పర్సనల్ లో ఎంతో అప్యాయంగా ఉండే కేసీఆర్ ఇప్పటికీ స్నేహితులను అక్కున చేర్చుకుంటారట.
కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. ఎం.ఏ తెలుగును అభ్యసించిన ఈయన చదువుతుండగానే శోభను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్ కేసీఆర్ కు రాజకీయ గురువు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత గురువుపైనే పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ ఆ తరువాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
మలిదశ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ ను ప్రభావితం చేశారు. దీంతో 2001లో ఉత్తరాఖండ్ లో ుద్యమకారులతో కలిసి రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రసమితిని ప్రారంభించారు. 2001 మే 17న తెలంగాణ సింహగర్ఝన పేరిటి సభను ఏర్పరిచి తెలంగానను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన ఓ చైల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.