https://oktelugu.com/

KL Rahul : “నేను ఇంకెం చేయాలి” అని ప్రశ్నించుకున్నాడు.. ఆ తర్వాతే అసలు కథ మొదలు..ఇప్పుడిక గంభీర్ కూడా ఏం చేయలేడు?

KL Rahul : "సాధారణంగా నేను క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా చూడను. మైదానంలో ఎక్కువగా చూస్తాను కాబట్టి.. టీవీలో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపను.

Written By: , Updated On : March 11, 2025 / 08:52 AM IST
KL Rahul

KL Rahul

Follow us on

KL Rahul : “సాధారణంగా నేను క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా చూడను. మైదానంలో ఎక్కువగా చూస్తాను కాబట్టి.. టీవీలో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపను. ఒకవేళ ఆడేది కేఎల్ రాహుల్ అయితే మాత్రం కచ్చితంగా టీవీలో మ్యాచ్ చూస్తాను. అతడు టెక్నిక్ తో ఆడుతుంటాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతుంటాడు. బౌలర్ ఎవరనేది చూడడు కానీ.. ముందుగా బౌలర్ కు గౌరవం ఇస్తాడు. ఆ గౌరవానికి లోబడి బౌలర్ ఉంటే.. ఇతడు కూడా తన పని తాను చేస్తాడు. బౌలర్ కాస్త పరిధి దాటితే మాత్రం.. ఇతడు రెచ్చిపోతాడు. మామూలుగా కాదు బ్యాట్ తో శివతాండవం చేస్తాడు. అసలు ఎందుకు వీడికి బౌలింగ్ చేశాను రా అని బౌలర్ అనుకునేలాగా చేస్తాడు. ఈ కాలంలో నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్ లలో కేఎల్ రాహుల్ ఒకడు. అందువల్లే అతని ఆట చూడడానికి నేను ఇష్టపడతాను” ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. టీమిండియా గ్రేట్ వాల్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ లాంటి వ్యక్తి అలాంటి మాటలు అన్నాడంటే ఆ ఆటగాడు ఎలాంటి వాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఎల్ రాహుల్ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఆట తీరు కొనసాగించాడు. కొన్ని సందర్భాల్లో అతడు చేసిన తప్పు జట్టులో స్థానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో అతడు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తనకంటే మెరిట్ తక్కువ ఉన్న ఆటగాళ్లు ఆడుతుంటే చూడాల్సి వచ్చింది.

Also Read : అతడు మద్దతుగా నిలిచాడు.. అందువల్లే 42 పరుగులు చేయగలిగాను.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

నేను ఇంకేం చేయాలి

కేఎల్ రాహుల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్పు లాంటి మెగా టోర్నీలలో అతడు స్థానం సంపాదించుకోలేకపోయాడు. దీంతో అతడికి జట్టులో ఇక అవకాశాలు లభించవు అనుకుంటున్న తరుణంలో.. ఛాంపియన్ ట్రోఫీకి ఆడాలని పిలుపు వచ్చింది. అందులో కూడా రిషబ్ పంత్ వైపు మేనేజ్మెంట్ ఆసక్తి చూపించింది. అయితే గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో తుది జట్టులో కేఎల్ రాహుల్ స్థానం సంపాదించుకున్నాడు. అయితే “కీపింగ్ సరిగ్గా చేయడం లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతడిని ఎందుకు తీసుకున్నారు” అనే విమర్శలు వచ్చాయి. దీంతో కేఎల్ రాహుల్ స్పందించక తప్పలేదు..” నేను ఇంకేం చేయాలి” అని రాహుల్ తన అంతరంగాన్ని సన్నిహిత క్రికెటర్ల వద్ద పంచుకున్నాడు. అది కాస్త మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. వాస్తవానికి కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై, ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో తీవ్రమైనప్పుడు కేఎల్ రాహుల్ (34*) ఆడిన తీరు అనన్య సామాన్యం. జట్టును గెలిపించిన తీరు అద్భుతం. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సిక్సర్ కొట్టి.. రాహుల్ టీం ఇండియా అని గెలిపించాడు . మొదట్లో సుస్థిరమైన స్థానం లేక ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు తన ఆట తీరుతోనే అందరికీ సమాధానం చెప్పాడు.. ఇప్పుడిక గౌతమ్ గంభీర్ కూడా అతడిని ఏమీ చేయలేడు. అతని కెరియర్ తో ఆడుకోలేడు.

Also Read : గెలిపించిన కేఎల్ రాహుల్ పై ప్రేమను చాటుకున్న అభిమాని.. వైరల్ వీడియో