KL Rahul: మనదేశంలో క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వారిని ఆరాధ్య దైవాలుగా అభిమానులు భావిస్తుంటారు. వారు కనిపిస్తే చాలు తమను తాము మైమరిచిపోతారు. వారితో ఒక సెల్ఫీ దిగాలని.. ఆటోగ్రాఫ్ తీసుకోవాలని.. ఆ లింగనం చేసుకోవాలని భావిస్తుంటారు.
Also Read: దుబాయ్ స్టేడియంలో లవ్లీ మూమెంట్స్.. విరాట్–అనుష్కల యాక్షన్.. రియాక్షన్!
వైరల్ వీడియో
గతంలో అభిమానులు క్రికెటర్లను కలవడానికి విఫల ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో స్టేడియాలలో భారీ భద్రత ఉన్నప్పటికీ దానిని చేదించుకొని లోపలికి వెళ్తున్నారు. తమ అభిమాన ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి.. ఆ లింగనం చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి, ఇటువంటి అనుభవాలు ఎక్కువగా ఎదురయ్యాయి. గతంలో మహేంద్ర సింగ్ ధోని కి కూడా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత అభిమానులను బయటకు తీసుకురావడం.. ఆ తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇటువంటివి వారి దృష్టికి వచ్చాయో తెలియదు గానీ.. తమను కలిసిన అభిమానులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని క్రికెటర్లు విన్నవించడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఇక తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లోఇటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
జీవితకాలం నిషేధం విధించినప్పటికీ..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరుకుంది. ఈరోజు లాహోర్ వేదికగా జరిగే సెమి ఫైనల్ మ్యాచ్లో గెలిచే జట్టుతో భారత్ ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా అన్ని రంగాలలో అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును 264 పరుగులకు అలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.. అయితే చివర్లో కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. ఇండియా 261 పరుగుల వద్ద ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో మాక్స్ వెల్ బంతిని అందుకున్నాడు. మాక్స్ వెల్ వేసిన తొలి బంతినే రాహుల్ సిక్సర్ గా మలిచాడు. దీంతో దుబాయ్ స్టేడియం మొత్తం సంబరాలు వెల్లి విరిసాయి. ఈ క్రమంలో ఓ అభిమాని దుబాయ్ స్టేడియంలో ఉన్న భద్రతను మొత్తం చేయించుకుని లోపలికి వెళ్ళాడు. విన్నింగ్ షాట్ కొట్టి విజయ గర్వంతో ఉన్న కేఎల్ రాహుల్ ను ఒక్కసారిగా ఆ లింగనం చేసుకున్నాడు. దుబాయ్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్తే.. వెళ్లిన అభిమాని పై జీవితకాల నిషేధం ఉంటుంది. ఇది తెలిసినప్పటికీ ఆ వ్యక్తి అలా చేయడం విశేషం. కేఎల్ రాహుల్ పై తనకున్న అభిమానాన్ని ఆ వ్యక్తి ఆ విధంగా చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
Also Read: ఫైనలూ పాయే.. పాకిస్తాన్ కు ఏదీ కలిసిరావడం లేదే.. సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్