KL Rahul: టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 45 రన్స్ కొట్టాడు. కేఎల్ రాహుల్ కీలకంగా 42 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 27 పరుగులు చేశాడు. ఇలా ఎవరికి వారు తమ పాత్రను పోషించడంతో టీమిండియా ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది. అయితే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ తర్వాత.. ఆ స్థాయిలో ఆకట్టుకున్నది కేఎల్ రాహుల్ ఆడిన తీరు. తీవ్ర ఒత్తిడి మధ్యలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా తో కలిసి అతడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో 47, హార్దిక్ పాండ్యాతో 34 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించాడు. అందువల్ల టీమిండియా విజయం వైపు ప్రయాణం చేయగలిగింది. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది. మాక్స్ వెల్ బౌలింగ్లో విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టిన విధానం మ్యాచ్ కే హైలెట్గా నిలిచింది. సిక్సర్ కొట్టిన తర్వాత ఒక్కసారి గా అతడు ఊపిరి పీల్చుకున్న విధానం అభిమానులకు కొత్తగా కనిపించింది.
Also Read : గెలిపించిన కేఎల్ రాహుల్ పై ప్రేమను చాటుకున్న అభిమాని.. వైరల్ వీడియో
అతని వల్లే ఇదంతా..
మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన మనసులో ఇన్ని రోజులపాటు గూడు కట్టుకున్న ఆవేదన మొత్తాన్ని చెప్పేశాడు..” వన్డే వరల్డ్ కప్ లో అవకాశం లభించింది. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా కాస్త బాధనిపించింది. ఆ తర్వాత మేజర్ టోర్నీలలో నాకు అవకాశం రాలేదు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత.. టి20లలో అవకాశాలు లభించలేదు. అంతకంటే ముందు టీ20 వరల్డ్ కప్ లోను నాకు చోటు దక్కలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. కాని చివరికి నాకంటూ అవకాశం లభించింది. ఇది రావడానికి కెప్టెన్ రోహిత్ శర్మ కారణమయ్యాడు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. నా ఆట తీరుతో సమాధానం చెప్పాను. ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఇన్నింగ్స్ వల్ల టీమ్ ఇండియా గెలవడం మాత్రమే కాదు.. నాపై ఉన్న నమ్మకాన్ని కూడా ప్రదర్శించుకోవడానికి అవకాశం దక్కింది. ఇది ఒక రకంగా రోహిత్ నాకు ఇచ్చిన గౌరవం.. విలువైన బహుమతి.. దానిని నేను సగౌరవంగా ఉంచుకుంటానని” రాహుల్ వ్యాఖ్యానించాడు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ శర్మ వల్లే తను ఈ స్థాయిలో ఆడాలని రాహుల్ వ్యాఖ్యానించడం.. నెటిజన్లకు విపరీతంగా నచ్చుతోంది.
Also Read : 2023 లో ఓడించిన బాధ.. అందుకే ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్ కసిగా ఆడాడా?